Begin typing your search above and press return to search.

నీలాంటి వాడిని ఎక్కడ చూడలేదు థమన్ భయ్యా..!

By:  Tupaki Desk   |   2 Feb 2023 6:56 PM GMT
నీలాంటి వాడిని ఎక్కడ చూడలేదు థమన్ భయ్యా..!
X
థమన్ తన పాటలతో మాత్రమే కాకుండా సోషల్ మీడియా లో ట్రోల్స్ తో మరియు ఆయన చేసే వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటూనే ఉన్నాడు. టాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ మ్యూజిక్ డైరెక్ట్స్ లో థమన్ ఒకడు అనడంలో సందేహం లేదు. థమన్‌ నుండి ఏ మ్యూజిక్ ఆల్బం వచ్చినా కూడా ఏదో ఒక విధంగా వివాదం రాజుకుని వార్తల్లో ఉండటం కామన్‌ విషయం.

ఆ మధ్య పదే పదే థమన్‌ ను కాపీ క్యాట్‌ అంటూ కొందరు విమర్శలు చేసేవారు. తన పాటలతో తన వర్క్ తో వారందరి నోరును థమన్ మూయించాడు. స్టార్‌ మ్యూజిక్ కంపోజర్ గా థమన్‌ నిలిచాడు. అధ్బుతమైన ఆల్బంలను థమన్‌ ఇచ్చి తెలుగు సినిమాకు యూట్యూబ్‌ లో ఏకంగా బిలియన్ వ్యూస్ ను చూపించాడు.

తాజాగా థమన్‌ పై సోషల్‌ మీడియాలో కొందరు విమర్శలు చేస్తున్నారు. కారణం ఏంటీ అంటే తాను చేసే అన్ని సినిమాలను డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని.. లేదా ఆ హీరోతో చేయడం నా డ్రీమ్‌ అంటూ వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. ప్రతి సినిమాకు కూడా కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌ గా చాలా ఎగ్జైట్‌ అవుతూ ఉంటాడు.

తాజాగా రామ్‌ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కోసం ప్రాణం పెట్టి సంగీతాన్ని అందిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు మరియు త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందుతున్న సినిమా కోసం ఒక డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు.

అంతకు ముందు వచ్చిన సినిమాల ప్రస్తావన వచ్చిన సమయంలో కూడా ఆకాశమే హద్దు అన్నట్లుగా.. ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కనుక అత్యుత్సాహం చూపించినట్లుగా థమన్‌ వ్యాఖ్యలు చేశాడు. తాజా ఇంటర్వ్యూలో రామ్‌ చరణ్‌ మరియు మహేష్ బాబుల యొక్క సినిమాల ప్రస్తావన తీసుకు వచ్చి థమన్‌ చేసిన వ్యాఖ్యలు ట్రోల్స్ కు కారణం అయ్యాయి.

ఇంత మందిని అభిమానించే వాడిని.. ఇన్ని డ్రీమ్ ప్రాజెక్ట్స్ కలిగి ఉన్న వాడిని మేము ఎక్కడ చూడలేదు. ఇలాంటివి నీకే సాధ్యం.. ఇంత మందిని అభిమానించే నీలాంటి గొప్ప అభిమాని ని మేము ఎక్కడ చూడలేదు థమన్ భయ్యా అంటూ ట్విట్టర్ ద్వారా కొందరు కామెంట్స్ చేశారు. ఇకపై అయినా థమన్ ఎగ్జైట్‌ అయ్యి చేసే వ్యాఖ్యలు మానుకుంటే బాగుంటుందని.. మాటల్లో కాకుండా సినిమాలకు ఇచ్చే సంగీతం పై దృష్టి పెట్టాలని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.