Begin typing your search above and press return to search.
తమన్ ని ఆడేసుకుంటున్నారుగా
By: Tupaki Desk | 28 Jan 2023 5:59 PMరాజమౌళి తెరకెక్కించిన `RRR` పలు అంతర్జాతీయ పురస్కారాల్ని దక్కించుకుంటూ విశ్వవేదికపై విజయకేతనం ఎగురవేస్తూ ఆస్కార్ బరిలో దూసుకుపోయింది. `నాటు నాటు` సాంగ్ కు గానూ `RRR` కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. క్రిటిక్స్ ఛాయిస్, న్యూయార్క్ క్రిటక్స్ అవార్డుతో పాటు ప్రఖ్యాత జపాన్ అకాడమీకి చెందిన అవార్డుని కూడా దక్కించుకుని ప్రస్తుతం ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది.
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో `నాటు నాటు`కు గానూ ఆస్కార్ నామినేషన్స్ లో `RRR` నిలిచిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే `RRR` మూవీతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి రాజమౌళి తీసుకెళ్లాడని, అంతే కాకుండా ఇండియన్‌సినిమా ఆస్కార్ బరిలోకి వెళ్లడానికి రాజమౌళి బాటలు వేశారని, దీన్ని మీరు ఎలా చూస్తారని ఓ మీడియా తమన్ ని ప్రశ్నిస్తే ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. త్రివిక్రమ్ గారు కూడా మమ్మల్ని ఆస్కార్ స్థాయికి ఈసుకెళతాడనే నమ్మకముంది` అని రిప్లై ఇచ్చాడు.
ఈ సమాధానమే తమన్ అడ్డంగా బుక్కయ్యేలా చేసింది. తమన్ చెప్పిన సమాదానం విన్న నెటిజన్ లు అతనిపై విరుచుకుపడుతున్నారు. త్రివిక్రమ్ ఆస్కార్ వరకు తీసుకెళతాడని ఏ నమ్మకంతో చెబుతున్నావరని, ఇంత వరకు పాన్ వరల్డ్ కాదు కదా.. పాన్ ఇండియా సినిమానే తీయని త్రివిక్రమ్ ఎలా ఆస్కార్ వరకు వెళతాడంటూ తమన్ పై మండిపడుతున్నారు. రాజమౌళి చేసన దాంట్లో సగం కూడా త్రివిక్రమ్ చేయలేదని సెటైర్లు వేస్తున్నారు.
`RRR`తో రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా గ్లోబల్ గా పాపులారిటీని దక్కించుకున్నారని, హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల దృష్టిని ఆకర్షించాడని, అలాంటి దర్శకుడితో త్రివిక్రమ్ ని ఎలా పోలుస్తున్నావని మండిపడుతున్నారట. త్రివిక్రమ్ కోసం తమన్ చేస్తున్న భజనలో అర్థం లేదని సెటైర్లు వేస్తున్నారట. ఇదిలా వుంటే త్రివిక్రమ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.