Begin typing your search above and press return to search.

ట్రెండింగ్ లో #DisasterSVP నెగెటివ్ హ్యాష్ ట్యాగ్..!

By:  Tupaki Desk   |   12 May 2022 9:10 AM GMT
ట్రెండింగ్ లో #DisasterSVP నెగెటివ్ హ్యాష్ ట్యాగ్..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురాం పెట్లా దర్శకత్వంలో తెరకెక్కిన ''సర్కారు వారి పాట'' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 'భరత్ అనే నేను' 'మహర్షి' 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత మహేశ్ నటించిన సినిమా కావడం.. 'గీతగోవిందం' లాంటి వంద కోట్ల సినిమా తర్వాత పరశురాం డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో మొదట్నుంచీ SVP పై అంచనాలు నెలకొన్నాయి.

అందులోనూ సర్కారు వారి పాటలన్నీ చార్ట్ బస్టర్ గా నిలవడం.. పవర్ ప్యాక్డ్ ట్రైలర్ కు అనూహ్య స్పందన రావడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ట్రైలర్ కంటే సినిమా వంద రెట్లు ఉంటుందని దర్శకుడు పరశురాం చెప్పడంతో అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. దీనికి తోడు ఫస్ట్ హాఫ్ లో 45 నిమిషాల ట్రాక్ కు థియేటర్ ఊగిపోతుందని.. 'పోకిరి' తర్వాత అంత ఎంజాయ్ చేసి నటించిన సినిమా ఇదేనని మహేశ్ చెప్పడంతో భారీ హైప్ క్రియట్ అయింది.

ఇలా ఎన్నో అంచనాల మధ్య ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ''సర్కారు వారి పాట'' సినిమాకు తొలి రోజే మిశ్రమ స్పందన వస్తోంది. ఇలాంటి టాక్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న యాంటీ మహేశ్ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో రచ్చ చేయడం మొదలు పెట్టారు. ముందే రెడీ చేసి పెట్టుకున్న ఎడిటింగ్ ఫోటోలు మీమ్స్ తో ట్విట్టర్ ను హోరెత్తిస్తున్నారు.

సినిమా చూసే ఇలాంటి పోస్టులు పెడుతున్నారా లేదా అనేది తెలియదు కానీ.. గురువారం ఉదయం నుంచే #DisasterSVP అనే హాష్ ట్యాగ్ తో ట్వీట్లు పెడుతున్నారు యాంటీ ఫ్యాన్స్. సినిమా అస్సాం అంటూ పోస్టులు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. ఈ నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ ఓ ఇండియా వైడ్ ట్రెండ్ అవుతుందంటేనే టార్గెట్ పెట్టుకొని మరీ ట్వీట్స్ చేస్తున్నారని అర్థం అవుతోంది.

అయితే మహేశ్ బాబు ఫ్యాన్స్ కూడా దీనికి ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. వారి అభిమాన హీరోల సినిమా డిజాస్టర్ అయ్యాయనే అక్కసుతోనే ఇలా SVP పై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. యావరేజ్ రివ్యూస్ తోనే 'మహర్షి' 'సరిలేరు నీకెవ్వరు' బ్లాక్ బస్టర్స్ అందుకున్నాయని.. ఇప్పుడు 'సర్కారు వారి పాట' కూడా మ్యాజిక్ రిపీట్ చేస్తుందని అంటున్నారు.

ఇకపోతే 'సర్కారు వారి పాట' చిత్రానికి ఆంధ్రాలో సైక్లోన్ దెబ్బ పడినట్లు తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా పలు ఏరియాలలో బెనిఫిట్ షోలు క్యాన్సల్ చేసారని.. అలానే ఫస్ట్ డే బుకింగ్స్ కూడా డల్ గా ఉన్నాయని చెబుతున్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

ఇక యూఎస్ఏ లో ప్రీమియర్స్ లో సర్కారు వారి సందడి కనిపిస్తుంది. 442 లొకేషన్స్ లో $875K వసూలు చేసి 'భీమ్లా నాయక్' ప్రీమియర్స్ ను క్రాస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 'డాక్టర్ స్ట్రేంజ్' ప్రభావాన్ని తట్టుకొని మహేశ్ బాబు సినిమా ఎలాంటి వసూళ్ళను సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.