Begin typing your search above and press return to search.
నరేష్ -పవిత్ర `మళ్లీ మళ్లీ` జంటగానా?
By: Tupaki Desk | 29 May 2023 6:48 PMనరేష్-పవిత్రలు జంటగా నటించిన `మళ్లీ పెళ్లి` ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే. సినిమాపై ఆద్యంతం విమర్శల వర్షం కురుస్తుంది. రిలీజ్ కి ముందు ఇది మా వ్యక్తిగత కథ కాదని...అందరకీ కనెక్ట్ అయ్యే కథ అని...వృద్ధాప్యంలో ఆలుమగల కథని చాలా కథలే చెప్పారు. అయితే ట్రైలర్ లోనే నరేశ్ - పవిత్ర లోకేశ్ కి సంబంధించి వచ్చిన వార్తల నేపథ్యంలో కనిపించడం.. దానికి సంబంధించిన సంఘటనలు వంటి వాటితో ఓ సెక్షన్ ఆడియన్స్ లో ఆసక్తి ని రేకెత్తించింది.
ఈ నేపథ్యంలో సినిమాలో వాస్తవ సంఘటనలను పోలిన సన్నివేశాలు ఉన్నాయా? లేదంటే జరిగిన సంఘటనలనే సినిమాగా చేసారా? అన్న సందేహం ఉండేది. అందులో రెండవదే రిలీజ్ తర్వాత నిజమైంది. మూడవ పెళ్లి అంశాలతో బోర్ కొట్టించాడనే విమర్శలొచ్చాయి. సినిమాలో అంశాలు కంటే టీవీలో వచ్చిన అంశాలే బాగున్నాయ్ అంటూ అభిప్రాయపడ్డారు. పరోక్షంగా మరోకరి మనోభావాల్ని దెబ్బ తీసినట్లు ఉందని చెప్పుకొచ్చారు. ఇదంతా గతం.
మరి భవిష్యత్ లో ఈ జోడీ ఎలా ముందుకెళ్లబోతుంది? అంటే మరో ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. `మళ్లీ పెళ్లి`తో ఈ జోడీ సరిపెట్టుకోదుట. అంతకు మించి జంటగా సినిమాలు చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలిసింది. అందుకోసం టాలీవుడ్ లో కొంత మంది సీనియర్ దర్శకుల్ని రంగంలోకి దించుతున్నారుట. ఆ స్టోరీలు కూడా తన జీవితానికి దగ్గరగా ఉండటంతో పాటు..సమాజంలో చోటు చేసుకుంటున్న కొన్ని బర్నింగ్ అంశాలపై సినిమాలు చేయాలని భావిస్తున్నారుట.
ఆ సినిమాల్ని కూడా నరేష్ తన సొంత బ్యానర్లో నిర్మించాలనుకుంటున్నారుట. అందుకే నిర్మాణ సంస్థ పేరు కూడా మార్చినట్లు పరిశ్రమలో టాక్ వినిపిస్తుంది. వీలైనంత స్వేచ్ఛగా సినిమాలు చేయాలని.. బాలీవుడ్ నిర్మాణ సంస్థలా తన బ్యానర్ ని ఫేమస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారుట. మొత్తానికి నరేష్ చాలా పెద్ద ప్లాన్ తో సెకెండ్ ఇన్నింగ్స్ ని ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే లుక్ మార్చారు. కొత్త లైఫ్ స్టైల్ లోకి ఎంటర్ అయ్యారు. ఏ పని చేసినా అందులో వైవిథ్యత కోరుకుంటున్నారు. ఈరకమైన మార్పు మంచిదే.