దసరా.. నాని పెద్ద మాటలు మాట్లాడేశాడు

Mon Jan 30 2023 19:44:30 GMT+0530 (India Standard Time)

nani speech dasara movie teaser launch

నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా రూపొందుతున్న దసరా సినిమా టీజర్ ను నేడు విడుదల చేశారు. టీజర్ విడుదలకు ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. దసరా సినిమాలో నాని తన రెగ్యులర్ లుక్ కు పూర్తి విభిన్నంగా కనిపించబోతున్నట్లుగా ఫస్ట్ లుక్ లోనే చెప్పేశారు.మాసిన గడ్డం బొగ్గు గనుల్లో మసితో లుంగీ కట్టుకుని షర్ట్ సగం వేసుకుని మాస్ పాత్రలో నాని కనిపించబోతున్నాడు. టీజర్ లో నానిని చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలగక మానదు. నాని లుక్ తో పాటు దర్శకుడు శ్రీకాంత్ యొక్క టేకింగ్ మరియు కంటెంట్ పై కూడా ప్రేక్షకుల్లో టీజర్ చూసిన తర్వాత నమ్మకం కలుగుతోంది.

ఇక టీజర్ విడుదల సందర్భంగా నాని మాట్లాడుతూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశాడు. ఆ మాటలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో చర్చనీయాంశం అవుతున్నాయి. నానికి దసరా సినిమాపై ఉన్న నమ్మకం చూస్తే ఆశ్చర్యంగా ఉంది.

నాని మాట్లాడుతూ.. తెలుగు సినిమాకు ఇన్నాళ్లుగా నా సహకారం ఏంటో అంటూ చాలా ఆలోచించేవాడిని. తెలుగు సినిమాకు మాత్రమే కాకుండా ఇండియన్ సినిమాకు ఈ ఏడాది నా తరపున నుండి సహకారం ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అనేది దసరా సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవుతుంది.

గత ఏడాది తెలుగు నుండి ఆర్ఆర్ఆర్ మరియు కన్నడం నుండి కేజీఎఫ్ సినిమా వచ్చింది. ఈ ఏడాది తెలుగు నుండి దసరా వస్తుందని తన సినిమాను ఆ రెండు సినిమాలతో పోల్చుకున్నాడు. మొత్తానికి దసరా సినిమా పై నాని చేసిన ఈ వ్యాఖ్యలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అంతే కాకుండా శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరును గుర్తు పెట్టుకోండి అని కూడా నాని ట్వీట్ చేశాడు.

నాని ఈ మాటలు దసరా విడుదల సమయంలో కచ్చితంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం ఖాయం. దసరా సినిమా ఫలితం ను బట్టి నాని మాటలకు కౌంటర్ ఉండే అవకాశం ఉంది. అవన్నీ కూడా నానికి తెలుసు. అయినా కూడా ఈ మాటలు అన్నాడంటే దసరా పట్ల ఆయనకు ఉన్న నమ్మకం ఏంటో అర్థం చేసుకోవచ్చు. మార్చి 30న దసరా సినిమా విడుదల కాబోతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.