Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు ఆరెంజ్ భారం దించుకున్న నాగబాబు

By:  Tupaki Desk   |   29 March 2023 1:09 PM GMT
ఎట్టకేలకు ఆరెంజ్ భారం దించుకున్న నాగబాబు
X
రామ్‌ చరణ్ బర్త్‌ డే సందర్భంగా మగధీర సినిమాను రీ రిలీజ్ చేసేందుకు మొదట ఏర్పాట్లు జరిగాయి. కాని కొన్ని కారణాల వల్ల మగధీర కాకుండా ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేయడం జరిగింది. సూపర్ హిట్‌ సినిమా కాకుండా ఇలా అట్టర్ ఫ్లాప్‌ సినిమాను రీ రిలీజ్ చేయడం ఏంట్రా బాబు అంటూ కొందరు విమర్శలు చేస్తే మరి కొందరు మాత్రం మగధీర థియేట్రికల్‌ స్క్రీనింగ్ కోసం వెయిట్‌ చేస్తున్నామంటూ సోషల్‌ మీడియాలో హడావుడి చేశారు.

ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ చేసి.. వచ్చిన ప్రతి రూపాయిని కూడా జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వబోతున్నట్లుగా నాగబాబు ప్రకటించాడు. దాంతో మెగా ఫ్యాన్స్ మరియు జనసేన కార్యకర్తలు తమ వంతు అన్నట్లుగా ఆరెంజ్ థియేటర్ల వద్ద క్యూ కట్టారు. ఒక్క రోజు.. ఒక షో కాదు.. కంటిన్యూ గా ఆరెంజ్ షో లు పడుతూనే ఉన్నాయి.

నాగబాబు నిర్మాణంలో వచ్చిన ఆరెంజ్ సినిమా ఏ రేంజ్ డిజాస్టర్‌ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరెంజ్ సినిమా ఫెయిల్యూర్ కారణంగా నాగబాబు ఆర్థిక పరిస్థితి తలకిందులు అయిందట. ఆ సమస్యల నుండి బయట పడటానికి దాదాపుగా అయిదు సంవత్సాలు పట్టిందనే ప్రచారం జరిగింది. ఆరెంజ్ నష్టాల వల్ల ఆత్మహత్య చేసుకోవాలి అనిపించిందని నాగబాబు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఆ సమయంలో పవన్ ఆదుకున్నాడు అనే ప్రచారం జరిగింది.

ఆ విషయాలు పక్కన పెడితే చరణ్ బర్త్‌ డే సందర్భంగా రీ రిలీజ్ అయిన ఆరెంజ్ సినిమా మంచి వసూళ్లు నమోదు చేసింది. ఇప్పటికే రెండు కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మరో 50 లక్షల రూపాయల వసూళ్లు నమోదు అయే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఇప్పుడు చూసిన ప్రేక్షకులు ఆరెంజ్ సినిమా సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఎందుకు ఈ సినిమా ఫెయిల్యూర్ అయిందో అర్థం కావడం లేదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

పదేళ్ల తర్వాత వచ్చి ఉంటే ఆరెంజ్ మంచి విజయాన్ని సొంతం చేసుకుని ఉండేది అంటూ అప్పట్లోనే కొందరు కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ విషయం నిజమే అనిపిస్తుంది. ప్రస్తుత జనరేషన్‌ కు తగ్గట్లుగా ఆరెంజ్ సినిమా ఉంది. కనుక ఇప్పుడు విజయాన్ని సొంతం చేసుకుంది. నాగబాబు ఇన్నాళ్లు మోస్తూ వస్తున్న ఆరెంజ్ డిజాస్టర్‌ భారం రీ రిలీజ్ తర్వాత హిట్ టాక్ రావడంతో దించుకున్నట్లు అయిందని ఫ్యాన్స్ మరియు నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.