శోభితతో చైతు ఫొటో లీక్.. నిజమేంటంటే?

Tue Mar 28 2023 23:17:39 GMT+0530 (India Standard Time)

naga chaitanya photo leaked with Shobhita

అక్కినేని నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి వారిద్దరూ ఎలాంటి పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టిన వెంటనే వైరల్ అవుతూ వస్తోంది. సమంతతో నాగచైతన్యను కలుపుతూ నాగచైతన్యతో సమంతను కలుపుతూ... రక రకాల వార్తలు కూడా పుట్టుకొచ్చాయి.అయితే సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య.. శోభిత అనే టాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడని డేటింగ్ చేస్తున్నాడని వార్తలు ఎప్పటికప్పుడు వచ్చాయి. ఈ వార్తలు మొదట బాలీవుడ్ మీడియా స్టార్ట్ చేసింది. ఇక ఆ తరువాత టాలీవుడ్ మీడియా కూడా అదే కంటిన్యూ చేసింది. ఇక అలా గాసిప్స్ వచ్చినప్పటికీ కానీ నాగార్జున కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడూ స్పందించలేదు. ఈ విషయంలో శోభిత లేదని కొట్టివేసే ప్రయత్నం చేసింది. కానీ నాగచైతన్య కుటుంబ సభ్యుల నుంచి మాత్రం ఎలాంటి ఖండన లేదు.

ఇప్పుడు సరికొత్తగా మరో ప్రచారం తెర మీదకు వచ్చింది. అదేమిటంటే ఫిబ్రవరి నెలకు సంబంధించి లండన్ లో దిగిన ఫోటోగా చెప్పబడుతున్న ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వైరల్ అయిన ఫోటోలో నాగచైతన్య ఒక హోటల్ షెఫ్ తో ఫోటో దిగగా వెనకాల టేబుల్ మీద శోభిత ధూళిపాళ్ల చీర కట్టుకుని కూర్చున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఇది సరదాగా కలుసుకొని డిన్నర్ డేట్ కు కూడా వెళ్లి ఉండవచ్చు లేదంటే ఫ్రెండ్లీగా కూడా కలిసి ఉండవచ్చు అని అంటున్నారు

ఒక విధంగా నాగ చైతన్య అయితే పూర్తి స్థాయిలో ప్రస్తుతం తన కెరీర్ పై ఫోకస్ పెట్టాడు. అతను ప్రేమలో ఉన్నాడు అనేది అవాస్తవం అని దగ్గరి సన్నిహితులు చెబుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అతను వెంకట్ ప్రభు అనే తమిళ దర్శకుడు దర్శకత్వంలో కస్టడి అనే సినిమా చేస్తున్నాడు. శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద ఈ సినిమాని శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.