ఓటీటీ ల్లో వ్యూస్ లో దుమ్ము రేపిన సినిమాలు వెబ్ సీరిస్ లు!

Tue Aug 03 2021 19:00:01 GMT+0530 (IST)

movies and web series in OTT views

లాక్డౌన్ విధించినప్పటి నుంచి ప్రేక్షకులు వినోదం కోసం ఓటీటీ ల వైపు చూడటం మొదలుపెట్టారు. దీని వల్ల ఓటీటీ ల మధ్య భారీ పోటీ నెలకొంది. ప్రేక్షకులని అలరించడానికి ఓటీటీలు వైవిధ్యమైన కంటెంట్ ను అందిస్తున్నాయి. అలా ఎక్కువ స్ట్రీమ్ అయిన కంటెంట్ వివరాలు చూద్దాం.శిల్పా శెట్టి నటించిన హంగామా 2 ఈ వారంలో ఎక్కువగా వీక్షించిన సినిమా. విడుదలకి ముందు శిల్పా భర్త అడల్ట్ వీడియో కేసు వల్ల అరెస్టవడంతో ఆ ప్రభావం ఈ సినిమా మీద కొద్దిగా పడిందనే చెప్పాలి. లేకపోతే ఈ సినిమాని మరింత మంది చూసేవారు. అయినప్పటికీ 'హంగామా 2' 7.6 మిలియన్ వ్యూస్ నమోదు చేసింది. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలయ్యింది.

హిందీ వెబ్ సిరీస్ హాస్టల్ డాజ్ వెబ్ సిరీస్ 4.9 మిలియన్ వ్యూస్ తో రెండవ స్థానంలో నిలిచింది. బాలీవుడ్ భామ కృతి సనన్ ప్రధాన పాత్ర పోషించిన మీమీ 3.6 మిలియన్ వ్యూస్ తో మూడవ స్థానం సంపాదించుకుంది. సిటీ ఆఫ్ డ్రీమ్స్ 2(3.3 మిలియన్ వ్యూస్) స్పోర్ట్స్ డ్రామా తూఫాన్(2.2 మిలియన్ వ్యూస్) నాలుగు అయిదో స్థానంలో నిలిచాయి.

గత సంవత్సర కాలం నుంచి దాదాపు సినిమాలన్నీ ఓటీటీ ల్లోనే విడుదలవుతున్నాయి. కొన్ని విజయాన్ని సాధిస్తే కొన్ని నిర్మాతలని గట్టున పడేశాయి. విక్టరీ వెంకటేష్ నారప్ప కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలయ్యింది.