అఫిషియల్.. బ్యాచిలర్ నిజంగానే కుమ్మేశాడు

Sat Oct 23 2021 09:18:56 GMT+0530 (IST)

most eligible bachelor Latest Collections

అఖిల్ అక్కినేని హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా దసరా సందర్బంగా విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా సెకండ్ వేవ్ తర్వాత విడుదల అయిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని అంతా నమ్మకం వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగానే బ్యాచిలర్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అఖిల్ అక్కినేని కెరీర్ లో మొదటి బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకుంది. ఈ సినిమా వసూళ్ల విషయంలో సోషల్ మీడియాలో అంతా ఇంతా అంటూ వార్తలు వచ్చాయి. అభిమానులు కన్ఫ్యూజన్ లో ఉన్న సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు  అధికారికంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. యూనిట్ సభ్యుల అధికారిక ప్రకటనతో బ్యాచిలర్ నిజంగానే కుమ్మేశాడంటూ నెటిజన్స్ కామెంట్స్.సినిమా విడుదల అయిన మొదటి ఏడు రోజుల్లో 40 కోట్ల రూపాయల వసూళ్లు దక్కించుకున్నట్లుగా అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 40 కోట్ల గ్రాస్ వసూళ్లు అంటే మామూలు విషయం కాదు. ఈ వారం పెద్దగా సినిమాలు ఏమీ లేకపోవడంతో పాటు దసరాకు బ్యాచిలర్ తో వచ్చిన సినిమాలు కూడా పెద్దగా సందడి చేయని కారణంగా ఈ వారంలో కూడా బ్యాచిలర్ హడావుడి కనిపిస్తుంది. కనుక మరో 10 కోట్ల వరకు వసూళ్లు దక్కించుకుని 50 కోట్ల రూపాయల వసూళ్ల జాబితాలో చేరుతుందని బాక్సాఫీస్ రిపోర్టర్స్ అంటున్నారు.

అఖిల్ ఆరు ఏళ్లుగా ఎదురు చూస్తున్న కమర్షియల్ హిట్ ఎట్టకేలకు పడటంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమాను చేస్తున్నాడు. బ్యాచిలర్ సక్సెస్ తో ఏజెంట్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టడం జరుగుతుందట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచింది. కనుక సినిమా ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు. అఖిల్ అక్కినేని సినిమాలు ఇక నుండి వసూళ్ల పరంగా కుమ్మేయడం ఖాయం అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.