మోసగాళ్లు రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా..??

Sun Jan 24 2021 03:24:24 GMT+0530 (IST)

mosagallu release date fixed

గత కొంతకాలంగా టాలీవుడ్ హీరో మంచు విష్ణు కెరీర్ పరంగా చాలా స్లో అయ్యాడు. ప్రస్తుతం ఓ సాలిడ్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇండస్ట్రీలో చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా మారారు. కానీ విష్ణు ఆ ఫీట్ అందుకోలేకపోయాడు. విష్ణు నుండి సినిమా వచ్చి రెండేళ్ల పైనే అవుతోంది. మొన్నటి వరకు వరుస ప్లాప్ లను ఖాతాలో వేసుకొని భరించలేక భారీ గ్యాప్ తీసుకున్నాడు. కానీ ఈసారి రీఎంట్రీ మాత్రం పక్కా ప్రణాళికతో ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం విష్ణు హీరోగా "మోసగాళ్లు" అనే సినిమా రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాను మీడియాపరంగా హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేస్తానని అందరిలో కలిగించాడు. ఇంతగట్టిగా చెబుతున్నాడంటే సినిమాలో ఏదో బలమైన మ్యాటర్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ సినిమా ఇంగ్లీష్ తెలుగు బాషలతో పాటు హిందీ హిందీలో కూడా రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఎప్పుడు రిలీజ్ అనే సంగతి మాత్రం బయటికి చెప్పలేదు.తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా విడుదల తేదీ ఖరారు అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. విష్ణు నటిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మల్టీలాంగ్వేజ్ సినిమా మార్చ్ 11న విడుదల అయ్యే అవకాశలు ఉన్నట్లు సినీవర్గాలలో టాక్. అధికారికంగా బయటికి రానప్పటికి ఇదే అంటూ కథనాలు వైరల్ అవుతున్నాయి. అయితే విష్ణు కెరీర్ లో ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. షూటింగ్ ఎప్పుడో ముగిసిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బెస్ట్ అవుట్ ఫుట్ కోసం టైం కేటాయిస్తున్నారు. అయితే మార్చ్ 11న విడుదల కాబోతుందని వార్తలు వస్తున్నప్పటికి హీరో కం నిర్మాత విష్ణు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. చూస్తుంటే సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేస్తారని అనిపిస్తుంది. దేశంలో జరిగిన ఓ భారీ ఐటీ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణుకు జోడిగా రూహి సింగ్ పరిచయం అవుతోంది. ఇక కాజల్ అగర్వాల్ సునీల్ శెట్టిలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను జెఫ్రి గీచిన్ డైరెక్ట్ చేస్తున్నాడు. చూడాలి మరి విష్ణు నుండి ఎలాంటి స్పందన రానుందో..!