దుర్వాసముని లుక్ లో మోహన్ బాబు అదుర్స్..!

Sat Mar 18 2023 11:39:59 GMT+0530 (India Standard Time)

mohan babu in shakuntalam movie

స్టార్ హీరోయిన్ సమంత శకుంతలగా మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం. అయితే గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలాన్ని సినిమాగా రూపొందిస్తుండగా... దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. అది చూసినప్పటి నుంచి ప్రేక్షకులంతా సామ్ పౌరాణిక చిత్రం కోసం తెగ వేచి చూస్తున్నారు. ట్రైలర్ తో పాటు ఈ మూవీలోని పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్ డేట్ ను బయటకు వదిలారు. ఈ చిత్రంలో నటప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు కూడా నటిస్తున్నారు. అయితే ఆయన ఈ చిత్రంలో దుర్వాసముని పాత్రలో కనిపించబోతున్నారు. ఈ క్రమంలోనే చిత్రబృందం ఆయన లుక్ ను విడుదల చేసింది. దుర్వాసముని పాత్రలో మోహన్ బాబు చాలా బాగా సెట్ అయ్యారు. తెల్లటి పొడవాటి గడ్డం పైన కొప్పు.. మెడలో రుద్రాక్ష మాల ఓ చేతిలో చెంబు మరో చేతిలో యోగ దండం కాషాయ బట్టలు చెక్క చెప్పులో అదిరిపోయారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది.  

గతేడాదిలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల వల్ల పోస్ట్ పోన్ చేశారు. కారణం ఏంటో తెలియకపోయినప్పటికీ సినిమాను రమూడు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగుతో పాటు హిందీ మలయాళం తమిళ కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చే నెలలో రిలీజ్ చేయబోతున్నారు.

నీలిమ గుణశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితి బాలన్ అల్లు అర్హ వర్ణిణి సౌందరరాజన్ కబీర్ సింగ్ దుహా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా.. సాయి మాధవ్ బుర్రా రచనా సహకారం అందించారు. అయితే ఈ సినిమాలో సామ్ ను శకుంతలగా చూపించేందుకు గుణ శేఖర్ ఎంతగానో కష్టపడ్డారు. ప్రతీ ఫ్రేమ్ లోనూ గొప్పగా చూపించేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తీసుకున్నారు. పౌరాణిక ప్రేమగాథలో ఒరిజినాలిటీ ఉండేందుకు ఒరిజినల్ నగలనే వాడారట చిత్రబృందం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.