Begin typing your search above and press return to search.

మోహన్ బాబుని బాధపెట్టిన జిన్నా రిజల్ట్..!

By:  Tupaki Desk   |   21 March 2023 8:00 AM GMT
మోహన్ బాబుని బాధపెట్టిన జిన్నా రిజల్ట్..!
X
మంచు మోహన్ బాబు నిర్మాతగా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నుంచి సినిమా అంటే ఒకప్పుడు సూపర్ హిట్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ బ్యానర్ నుంచి వరుస ఫ్లాపులు వస్తున్నాయి. మోహన్ బాబు కూడా సినిమాలు చాలా అరుదుగా చేస్తున్నారు. ఆయన చేసిన సన్ ఆఫ్ ఇండియా సినిమా తీవ్రంగా నిరాశ పరచింది. అది ఒక ప్రయోగాత్మక సినిమా దాని ఫెయిల్యూర్ పెద్దగా పట్టించుకోలేదని అన్నారు మోహన్ బాబు. కానీ మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా ఫ్లాప్ మాత్రం తనని బాధ పెట్టిందని చెప్పుకొచ్చారు.

రీసెంట్ గా ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ బాబు తన బ్యానర్ వరుస సినిమాలు విఫలమవడం పై స్పందించారు. సన్ ఆఫ్ ఇండియా ఫలితం నిరాశపరచినా దానికి బాధపడలేదని. కానీ మంచు విష్ణు నటించిన జిన్నా ఫ్లాప్ మాత్రం చాలా బాధ కలిగించిందని అన్నారు. మంచు కెరీర్ లో బెస్ట్ మూవీ జిన్నా కానీ ఆ సినిమా ఫలితం మాత్రం తీవ్రంగా నిరాశ పరచిందని అన్నారు మోహన్ బాబు. ఇక ఇదే ఇంటర్వ్యూలో చిరంజీవితో విభేదాల గురించి స్పందించారు మోహన్ బాబు.

చిరంజీవితో తనకు ఎలాంటి గొడవలు లేవని ఇద్దరం ఎదురుపడినప్పుడు మంచిగా పలకరించుకుంటామని. స్నేహితుల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం కానీ మీడియాలో వచ్చే స్థాయిలో మాత్రం ఉండవని అన్నారు. ఇక మీడియాలో తమ ఫ్యామిలీపై వస్తున్న ట్రోల్స్ ని తాను అసలు పట్టించుకోనని అన్నారు మోహన్ బాబు. ఇక అవార్డుల గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు. తన సినిమాలకు అవార్డుల అర్హత ఉన్నా కొందరు కావాలని వేరే సినిమాలకు ఇచ్చారని అన్నారు.

ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ రావడం పట్ల ఒక తెలుగు వాడిగ గర్వపడుతున్నానని.. రాజమౌళి, కీరవాణి ఆ సినిమా యూనిట్ మొత్తానికి తన శుభాకాంక్షలు తెలిపానని అన్నారు. మంచు ఫ్యామిలీలో మోహన్ బాబు ఆల్మోస్ట్ ఫాం కోల్పోగా.. మంచు విష్ణు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మంచు మనోజ్ మళ్లీ రీ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే మంచు ఫ్యాన్స్ మాత్రం మనోజ్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.