నా భర్తే నన్ను నష్టాల్లోకి తోసేసాడు.. ప్రముఖ నటి

Fri May 29 2020 13:30:49 GMT+0530 (IST)

mla rk roja facts about her husband

రోజా సెల్వమణి.. అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు కానీ హీరోయిన్ రోజా అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. దక్షిణాది బాషల సినిమాల్లో నటించి తిరుగులేని హీరోయిన్ గా స్టార్డం చూసింది. సౌత్ లోని స్టార్ హీరోల అందరి సరసన నటించి.. లక్షల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగేటప్పుడే ప్రేమించిన వ్యక్తి ఆర్కె సెల్వమణిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరమైంది. కానీ టీవీ ప్రోగ్రాంల ద్వారా అభిమానులకు మళ్లీ దగ్గరైంది. రోజా కొన్ని రియాల్టీ షోలతో బిబీబిజీగా ఉంటూనే రాజకీయంగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో ఫైర్ బ్రాండ్ అనే పిలుపు పొందింది. అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్న రోజా.. తన భర్త కారణంగా ఓ సందర్భంలో పూర్తిగా నష్టపోయానని సంచలన వ్యాఖ్యలు చేసింది.తాజాగా రోజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడి ఎన్నో విషయాలు బయట పెట్టింది. రోజాను తమిళ ఇండస్ట్రీకి `చెంబరుతి` సినిమా ద్వారా డైరెక్టర్ సెల్వమణి పరిచయం చేశారు. ఈ సినిమాలో ప్రశాంత్ కథానాయకుడిగా నటించగా.. ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ సెల్వమణి రోజా మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త.. ప్రేమగా మారిందట. చివరకు 2002లో పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే రోజాకి పెళ్లి జరిగిన విషయం అందరికీ తెలిసిందే.. కానీ వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది. విషయం మాత్రం ఎవరికీ తెలియదు. నిజానికి సెల్వమణి రోజాను ప్రేమించిన విషయాన్ని ముందుగా రోజా తండ్రి దగ్గరకు వెళ్లి చెప్పాడట.

రోజా తండ్రిని ఒప్పించుకుని ఆ తర్వాత రోజాకు విషయం చెప్పాడట సెల్వమణి. ఇక రోజా కూడా సెల్వమణి ప్రేమకోసం బాగానే కష్టపడిందట. ఆయన కోసం తమిళం బాష మాట్లాడటం చదవడం కూడా నేర్చుకుందట. చివరకు ప్రేమించిన దర్శకుడినే పెళ్లాడి.. లైఫ్‌ను హ్యాపీగా లీడ్ చేస్తుంది.  అయితే 1994లో సమరం అనే ఓ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ సినిమాను రోజా నిర్మించింది. అందులో హీరోహీరోయిన్లగా సుమన్ రోజా తదితరులు నటించారు. ఇక ఈ సినిమాను రోజా భర్త ఆర్కె సెల్వమణి తెరకెక్కించాడు. ఇళయరాజా సంగీతం అందించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమా దెబ్బతో రోజాకు ఆర్థికంగా కుదేలైంది. అలా తన భర్త తీసిన సినిమా వల్ల నేను ఆర్థిక నష్టాలు ఎదుర్కొన్నానని రోజా తెలిపింది. ప్రస్తుతం రోజా దంపతులు తమ పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక రాజకీయంగా వైవాహిక జీవితం పరంగా రోజా బాగానే ఉన్నట్లు తెలుస్తుంది. తన భర్త వల్లే నష్టపోయాయను అనడంతో ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.