Begin typing your search above and press return to search.

ఫిల్మ్ క్రిటిక్స్ కి యంగెస్ట్ ప్రెసిడెంట్ గిఫ్ట్ ఏంటి?

By:  Tupaki Desk   |   24 Oct 2021 9:31 AM GMT
ఫిల్మ్ క్రిటిక్స్ కి యంగెస్ట్ ప్రెసిడెంట్ గిఫ్ట్ ఏంటి?
X
యాబై ఏళ్ల చరిత్రగల ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సినిమా పరిశ్రమలో ఎన్నో మంచి బృహత్తర కార్యక్రమాలను చేపట్టింది.. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు గా గెలుపొందిన విష్ణు మంచు ని అక్టోబర్ 23న హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లోని `మా` కార్యాలయంలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది.

ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణరావు- అధ్యక్షుడు ఏ. ప్రభు- కార్యదర్శి పర్వతనేని రాంబాబులతో పాటు మాజీ అధ్యక్షుడు సురేష్ కొండేటి- మా జనరల్ సెక్రెటరీ శివబాలాజీ- ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అబ్దుల్- మురళి- మల్లికార్జున్- జిల్లా సురేష్- కుమార్- వీర్ని శ్రీనివాస్- నవీన్ పాల్గొన్నారు.. అనంతరం కె. లక్ష్మణరావు విష్ణు మంచును శాలువతో సత్కరించగా అధ్యక్షుడు ప్రభు- కార్యదర్శి రాంబాబు ఫ్లవర్ బొకేలను అందించారు..

ఈ సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ. ప్రభు మాట్లాడుతూ.. ``మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొంది అధ్యక్ష పీఠాన్ని అలంకరించినటువంటి మంచు విష్ణు గారిని ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అభినందించడం చాలా హ్యాపీగా ఉంది. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ యాబై సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఒక ట్రెడిషనల్ ఆర్గనైజేషన్.. మొదటి నుండి చిత్ర పరిశ్రమకు, ప్రజలకు మధ్య వారధిగా ఉన్నటువంటి గొప్ప చరిత్రకలిగినటువంటి అసోసియేషన్ ఇది. గతంలో అక్కినేని నాగేశ్వరరావు గారు 60 సంవత్సరాలు చలనచిత్ర జీవితం పూర్తిచేసుకున్న సందర్భంగా ముందుగా నాకు ఫిల్మ్ క్రిటిక్స్ ద్వారా సన్మానం జరిగితే దానికొక విలువ, గౌరవం ఉంటాయి అని భావించి తనకై తాను ప్రతిపాదించుకొని ఆ గౌరవాన్ని పొందారు. అలాంటి ఘనత, చరిత్ర ఉన్న ష్ట్రాంగెస్ట్ అసోసియేషన్ ఫిల్మ్ క్రిటిక్స్. మా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత విష్ణు గారికి మేము చేస్తున్న తొలి సన్మానం ఇది. ఆయన కెరీర్ పరంగా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విజయాల పరంగా ఎన్నెన్నో సక్సెస్ లు సాధించాలని మనసారా కోరుకుంటున్నాం.. మా అసోసియేషన్ విష్ణు డైనమిక్ లీడర్ షిప్ లో అద్భుత విజయాలు సాధించాలని.. సభ్యుల సంక్షేమం కోసం మరింతగా పాటు పడి 900 మంది సభ్యులున్నటువంటి మా అసోసియేషన్ సంఖ్యాపరంగా విస్తృతం అవ్వాలి... సంక్షేమ కార్యక్రమాల పరంగా కూడా విజయం సాధించి.. మా ప్రతిష్ఠతని, ..గౌరవాన్ని ఇంకా అభివృద్ది పరచాలని ఆశిస్తున్నాం.. చిన్న వయసులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన యంగెస్ట్ ప్రసిడెంట్ అనే క్రెడిట్ అండ్ రికార్డ్ అలా నిలిచిపోతుంది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు విష్ణు మంచు మాట్లాడుతూ.. `` ముందుగా నాకు ఈ సన్మానం చేసిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ వారికి థాంక్స్. నాకు ఊహ తెలిసినప్పటినుండి ప్రభు గారు పీఆర్ ఓ గా.. జర్నలిస్ట్ గా తెలుసు.. వాళ్ళ కళ్ళముందు పెరిగాను నేను. అలాంటిది ఇవాళ నాకు వాళ్ళు సన్మానం చేయటం చాలా హ్యాపీగా ఉంది. మనందరం ఒకే కులం.. సినిమా కులం. అందరికి కష్ట సుఖాలు ఉంటాయి.. జీవితంలో సక్సెస్ ఫెయిల్యూర్స్ కామన్.. కానీ భారతదేశంలో ఎన్ని సినిమా మీడియా నెట్ వర్క్స్ వున్నా.. తెలుగు సినిమా మీడియా ఏది మంచో ఏది చెడో ఉన్నది ఉన్నట్లు చూపించి హద్దులు దాటకుండా వేస్తారు. సినిమా జర్నలిస్టులు అందరూ మాకు ఎంతో సహకరించారు. వారందరికీ థాంక్స్. అలాగే మా నాన్నగారికి అందరూ అండగా ఉండి సపోర్ట్ చేశారు.. ఆయనకి సన్మానాలు సత్కారాలు చేశారు.. ఇప్పుడు నాకు చేశారు.. అందుకు నాకు చాలా గర్వంగా ఉంది.. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కు `మా` సహకారం ఎప్పుడూ ఉంటుంది.. మన హీరోయిన్స్ గురించి యూట్యూబ్ ఛానల్స్ పెట్టే థమ్బ్ నైల్స్ వలన చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని నియంత్రించేందుకు మీడియా సహకారం కావాలి. పూర్తి సహకారాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.. అన్నారు.

మా కోశాధికారి శివ బాలాజీ మాట్లాడుతూ... ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్.. మా అధ్యక్షుడు మంచు విష్ణును సత్కరించడం చాలా ఆనందంగా ఉంది. మన హీరోయిన్స్ గురించి యూట్యూబ్ ఛానల్స్ పెట్టే థమ్బ్ నైల్స్ వలన చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని నియంత్రించేందుకు మీడియా సహకారం కావాలి. పూర్తి సహకారాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు. అయితే ఫిల్మ్ క్రిటిక్స్ కి యంగెస్ట్ ప్రెసిడెంట్ గిఫ్ట్ ఏంటి? క్రిటిక్స్ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న వంతు స‌హ‌కారం ఏమిటీ? అన్న‌దానిపైనా చ‌ర్చ సాగింది.