ఫొటోటాక్ : కుర్రాళ్ల గుండె జారి గల్లంతు అయ్యేలా చేస్తోంది

Mon Aug 03 2020 11:30:56 GMT+0530 (IST)

malavika mohanan Stunning Pose

ఒకప్పుడు హాలీవుడ్ హీరోయిన్స్ మాత్రమే మోడ్రన్ డ్రస్ ల్లో అందాల విందు చేసేవారు. కాలం మారుతున్నా కొద్ది బాలీవుడ్ హీరోయిన్స్ క్లీవేజ్ షో చేయడం స్కిన్ షో చేసేలా కాస్ట్యూమ్స్ ధరించారు. గడచిన దశాబ్ద కాలంగా సౌత్ హీరోయిన్స్ కూడా బాలీవుడ్ హాలీవుడ్ వారికి మేము ఏమీ తక్కువ కాదన్న రేంజ్ లో డ్రస్ ల్లో రెచ్చి పోతున్నారు. హాట్ హాట్ ఫొటోలతో రెచ్చి పోతున్నారు. తాజాగా మాళవిక మోహన్ పోస్ట్ చేసిన ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.అందాల ప్రదర్శణకు మరో అర్థం అన్నట్లుగా ఈ అమ్మడి ఫొటో దుమ్ము రేపుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె ఫొటో వైరల్ అవుతోంది. 2013 సంవత్సరంలో పట్టం పోలె చిత్రంతో మలయాళ ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తర్వాత వరుసగా మలయాళంలో చిత్రాలు చేసింది ఇంకా చేస్తూనే ఉంది. మలయాళంతో పాటు ఈ అమ్మడికి కన్నడం హిందీ తమిళంలో కూడా ఆఫర్లు దక్కాయి.

తెలుగులో కూడా ఆమద్య ‘హీరో’ అనే చిత్రంలో విజయ్ దేవరకొండకు జోడీగా ఎంపిక అయ్యింది. కాని ఆ సినిమా కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది. ఇదే సమయంలో ఈమె తెలుగులో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాని ఒక స్టార్ హీరో సినిమా కోసం ఈ అమ్మడిని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఆ సినిమాతో తెలుగులో కూడా ఈ అమ్మడి పాదం పడుతుంది. దాంతో సౌత్ అన్ని భాషలతో పాటు హిందీలో కూడా నటించిన హీరోయిన్స్ జాబితాలో ఈ అమ్మడు చేరబోతుంది.