ఒక లేజీ సండే ఛయ్యా ఛయ్యా గాళ్ సరాగాలు

Mon Mar 01 2021 07:00:01 GMT+0530 (IST)

malaika Latest Photo

ఆదివారం ఆడాళ్లకు సెలవు. చూస్తుంటే మలైకా కూడా సెలవు దినాన్ని తనకు నచ్చిన రీతిలో ఆస్వాధిస్తున్నట్టే కనిపిస్తోంది. మలైకా అరోరా ఆదివారం నాడు ఇంట్లో సౌకర్యవంతమైన దుస్తులలో విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.వేడెక్కించే స్పోర్ట్స్ బ్రా .. స్వెట్ ప్యాంటు ధరించి ఇంట్లో లేజీగా గడిపేస్తోందిలా. తన అభిమానులకు ఆదివారం శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫోటోని షేర్ చేశారు.అథ్లెటిజర్ కొత్త లాంజ్ వేర్ ధరించి సౌకర్యవంతమైన దుస్తుల్లో మలైకా కనిపిస్తోంది. లాక్ డౌన్ ప్రారంభమైనప్పుడు కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు ఇంట్లో ఉండడం ప్రారంభించినప్పుడు అథ్లెటిజర్ తప్పనిసరిగా వార్డ్ రోబ్ లో చేరింది. లాంజ్ వేర్లను వార్డ్రోబ్ లో తప్పనిసరి చేసిన కొద్దిమంది ప్రముఖులలో కరీనా కపూర్ ఖాన్ .. మలైకా అరోరా ఉన్నారు. స్వెట్ ప్యాంటు నుండి సౌకర్యవంతమైన కఫ్తాన్ల వరకుఈ భామల అథ్లెట్ లుక్ ని మరో లెవల్ కి తీసుకువెళ్లాయి.

లాక్ డౌన్ ముగిసి జ నం కొంతవరకు బయటకు వెళ్లడం ప్రారంభించినప్పటికీ అథ్లెటైజర్ లుక్ కి ఇంకా డిమాండ్ ఉంది ఇదే విషయాన్ని మలైకా అరోరా అంగీకరించారు. ఓవైపు ఫ్యాషన్ ఈవెంట్లు.. టాప్ బ్రాండ్స్ కి మోడలింగ్ తో పాటు మరోవైపు టీవీ రియాలిటీ షోలతోనూ మలకా బిజీ.