సూపర్ స్టార్.. క్రేజీ డైరెక్టర్ కాంబో మూవీ డబుల్ ధమాకా

Sun Jun 26 2022 06:00:01 GMT+0530 (India Standard Time)

lokesh kanagaraj and vijay thalapathy upcoming movie news

తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా ప్రస్తుతం తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు అనే సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా ముగింపు దశకు వచ్చిందని సమాచారం అందుతోంది.విజయ్ తదుపరి సినిమా ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సినిమా విడుదల అవ్వకముందే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కబోతుంది.

వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన మాస్టర్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో విజయ్ తో పాటు విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో నటించాడు. విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమాల జాబితాలో మాస్టర్ ఉంటుంది. అలాంటి మాస్టర్ ను ఇచ్చిన లోకేష్ కనగరాజ్ తో మరోసారి విజయ్ నటించబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.

లోకేష్ ఇటీవల విక్రమ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ కు దాదాపుగా దశాబ్ద కాలం తర్వాత సక్సెస్ ను ఇచ్చిన లోకేష్ కనగరాజ్ తో సినిమాను చేసేందుకు పెద్ద స్టార్ హీరోలు కూడా సినిమాను చేయాలని ఆశ పడుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఆ జాబితాలో చేరారు. అలాంటి లోకేష్ తో విజయ్ చేయబోతున్న సినిమా గురించి ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది.

విజయ్ ను రెండు పాత్రల్లో చూపించబోతున్నాడట. రెండు విభిన్న వయసుల పాత్రల్లో విజయ్ ని తన సినిమాలో లోకేష్ కనగరాజ్ చూపించబోతున్నట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యిందట. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని తమిళ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

లోకేష్ కనగరాజ్ మరియు విజయ్ కాంబో మూవీ కోసం అభిమానులు తమిళ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మాస్టర్ ను మించిన బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలుస్తుందనే నమ్మకంతో అభిమానులు సైతం వెయిట్ చేస్తున్నారు. విజయ్ ని డబుల్ రోల్ లో చూడటం అంటే ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అనడంలో సందేహం లేదు.