పోటీలో అమీర్- విజయ్ ఉన్నా తగ్గేదేలే!

Sun Jan 16 2022 15:40:05 GMT+0530 (India Standard Time)

lal singh chaddha vs beast

ఒక సాధారణ బస్ డ్రైవర్ కొడుకు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అంతేకాదు.. ఇప్పుడు అతడు వస్తున్నాడంటే దేశంలోని నంబర్ వన్ హీరోలే గడగడలాడుతున్నారు. అటు హిందీ పరిశ్రమలో నంబర్ 1 బాక్సాఫీస్ వసూళ్ల రికార్డులతో సంచలనాలు సృష్టించిన అమీర్ ఖాన్ కి ఇటు కోలీవుడ్ లోనూ నంబర్ వన్ కేటగిరీలో వెలిగిపోతున్న దళపతి విజయ్ కి కూడా ఈ బస్ డ్రైవర్ కొడుకు మింగుడుపడని కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఇంతకీ ఎవరీ బస్ డ్రైవర్ సన్ ? అంటే.. ది గ్రేట్ యష్.  బస్టాప్ లో వారాల పాటు తలదాచుకుని అక్కడే నిదురించి చివరికి తాను అనుకున్నది సాధించుకున్న యష్ ఇప్పుడు కేజీఎఫ్ స్టార్ గా అందరికీ ఎదురెళుతున్నాడు. పోటీలో అమీర్ ఖాన్ .. విజయ్ లాంటి హీరోలు ఉన్నా నువ్వా నేనా? అంటున్నాడు.అమీర్ ఖాన్ వర్సెస్ కన్నడ సూపర్ స్టార్ యష్ 2021 ఏప్రిల్ 14న బాక్సాఫీస్ వద్ద ఢీకొనేందుకు సిద్ధంగా ఉన్నారు.. అంటూ బాలీవుడ్ మీడియానే హైలైట్ గా కథనాలు వండి వారుస్తోంది అంటూ యష్ రేంజు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అమీర్ ఫారెస్ట్ గంప్ రీమేక్ లాల్ సింగ్ చద్దా వర్సెస్ యష్ KGF2 అంటూ ప్రచారం హోరెత్తిపోతోంది. ఇక ఈ ఇద్దరితో పాటే అదే రోజు దళపతి విజయ్ నటించిన బీస్ట్ కూడా విడుదలవుతోంది. అంటే దేశంలోని ఇద్దరు టాప్ హీరోలతో రాక్ స్టార్ యష్ పోటీపడుతున్నాడు.

నిజానికి లాల్ సింగ్ చద్దా ఫిబ్రవరిలో విడుదల కావాల్సి ఉండగా..టీమ్ ప్లాన్ ని మార్చుకుంది. దీంతో KGF టీమ్ తమ సినిమాను 2022 ఏప్రిల్ 14 2022న స్లాట్ ని ఎంపిక చేసుకుంది. ఇంతలోనే ఇరువురి నడుమా ఏమి జరుగుతుందో కానీ డేట్లు మారాయి. ఒకే తేదీకి రెండు సినిమాలు ఫిక్సయ్యాయి. ఇక తాను కెజిఎఫ్ లీడింగ్ మ్యాన్ యష్.. దర్శకుడు ప్రశాంత్ నీల్ ని కలిశానని అమీర్ చెప్పారు. అంతేకాదు కేజీఎఫ్ 2 టీమ్ కి సారీ కూడా చెప్పాడు అమీర్. ఏదేమైనా లాల్ సింగ్ చద్దా కొత్త విడుదల తేదీతో యష్ చాలా కలత చెందాడని కూడా కథనాలొచ్చాయి.

ఒకసారి పోస్టర్ లో రిలీజ్ తేదీ వేశాక వెనక్కి తగ్గేదేలే! అంటూ ఇప్పుడు యష్ - KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ పంతంతో ఉన్నారట. ఏప్రిల్ 14 నుండి వైదొలగడం పిరికిపంద చర్చగా భావించారని సమాచారం. అయితే ఇది రెజ్లింగ్ మ్యాచ్ కాదు. ఇక్కడ ఇరు పక్షాలు తమ మైదానంలో నిలబడాలి. ఎవరైనా రెప్పవేయవలసి వస్తుంది! అని యష్ కి సన్నిహిత వర్గాలు నూరిపోస్తున్నాయట. నిజానికి ఏప్రిల్ 14న ఎవరు వస్తున్నారో ఎవరు రారో తేల్చేది ఓమిక్రాన్ అయితే ఏ సమస్యా లేదు

దాదాపు రెండేళ్లుగా వాయిదా వేస్తూనే ఉన్నామని కేజీఎఫ్ బృందాలు అనడం కొసమెరుపు. ఇప్పుడు థియేటర్లు తెరిచినప్పుడు మరో పెద్ద చిత్రంతో ఈ పరిస్థితి తలెత్తిందని యష్ బృందం నుంచి ఒకరు పేర్కొన్నారు. అయితే అదే రోజు విడుదల చేయాలని పట్టుబట్టడం (లాల్ సింగ్ చద్దా వలె) నష్టాన్ని కలిగిస్తుందని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ కేజీఎఫ్ 2 రిలీజ్ తేదీ మారేందుకు ఆస్కారం లేకపోలేదన్న గుసగుసా వేడెక్కిస్తోంది. ఈ విషయాన్ని తేల్చేందుకు అమీర్ ఖాన్- ప్రశాంత్ నీల్ ల మధ్య సమావేశం ఏర్పాటు చేసారు ఇటీవల.

కానీ చివరికి ఆ ఇద్దరూ పంతంతోనే ఉన్నారని గుసగుస వినిపిస్తోంది. ఇక ఏప్రిల్ 14 రిలీజ్ డేట్ విషయమై కేజీఎఫ్ 2.. లాల్ సింగ్ చద్దా.. బీస్ట్ టీమ్ లు పట్టుదలగా ఉన్నాయి. ముక్కోణపు పోటీ ఖాయమైనట్టేనా లేదా? అన్నదానికి కాలమే సమాధానమివ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మూడు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజైతే థియేటర్ల పరంగా ఇబ్బందికరమేనన్న చర్చా సాగుతోంది. యష్ ఆలోచన ప్రకారం పోటీలో ఎంతటి మొనగాళ్లు ఉన్నా రిలీజ్ ఆపలేం అన్నట్టే ఉందిట. మరి రియల్ హీరోగా ఎదిగిన బస్ డ్రైవర్ కొడుకు ఇద్దరు సూపర్ స్టార్లను ఎలా ఎదిరిస్తాడో చూడాలి.