Begin typing your search above and press return to search.

కొరియ‌న్ రిమేక్ లంటే ఎందుకింత మోజో?

By:  Tupaki Desk   |   28 Jan 2023 11:00 AM GMT
కొరియ‌న్ రిమేక్ లంటే ఎందుకింత మోజో?
X
గ‌తంలో చాలా వ‌ర‌కు మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ని మ‌లుపు తిప్పిన `ఖైదీ` నుంచి చాలా వ‌ర‌కు హాలీవుడ్ సినిమాల‌ని తాపీగా కాపీ చేస్తూ యాజీటీజ్ గా లేపేస్తూ ఫ్రీ మేక్ లు చేస్తూ వ‌చ్చారు మ‌న డైరెక్ట‌ర్లు. `ఖైదీ` మూవీని హాలీవుడ్ లో సిల్వెస్ట‌ర్ స్టాలోన్ న‌టించిన `ఫ‌స్ట్ బ్ల‌డ్‌` ఆధారంగా మ‌న తెలుగు నేటివిటీకి మార్పులు చేర్పులు చేసి తెర‌కెక్కించారు. ప్ర‌ధాన యాక్ష‌న్ ఘ‌ట్టాలు చాలా వ‌ర‌కు యాజిటీజ్ గా వాడేశారు. చిరు అడ‌విలోకి వెళ్ల‌డం ఎపిసోడ్ అంతా ఇందులోదే.

నిన్న మొన్న‌టి సాహో, అజ్ఞాత‌వాసి కూడా ఫ్రెంచ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `లార్గోవించ్‌` నుంచి లేపేశారంటూ స‌ద‌రు మూవీ ద‌ర్శ‌కుడు జెరోమ్ స‌ల్లే సోష‌ల్ మీడియా వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం తెలిసిందే. సోష‌ల్ మీడియా వాడ‌కం విస్తృతంగా పెర‌గ‌డం, ఆ త‌రువాత నుంచి హాలీవుడ్ వాళ్లు తెలుగు సినిమాల‌పై క‌న్నేయ‌డంతో మ‌న వాళ్లు యాజిటీజ్ గా లేపేయ‌డం ఆపేశారు. కీల‌క ఘ‌ట్టాల‌ని ఇప్ప‌టికీ ప‌లు హాలీవుడ్ మూవీస్ నుంచి లేపేస్తున్నార‌నే కాముంట్ లు ఇప్ప‌టికీ వినిపిస్తూనే వున్నాయి.

దీంతో మ‌న వాళ్లు చూపు గ‌త కొంత కాలంగా కొరియ‌న్ సినిమాల‌పై ప‌డింది. చాలా వ‌ర‌కు మ‌న వాళ్లు కొరియ‌న్ మూవీస్ ని తెలివిగా లేపేశారనే వార్త‌లు కూడా వినిపించాయి. నాని న‌టించిన `పిల్ల జ‌మీందార్` మూవీని కొరియ‌న్ మూవీ ఏ మిలియ‌నీర్ ఫ‌స్ట్ ల‌వ్‌` అనే సినిమా స్ఫూర్తితో తీశార‌ని ప్ర‌చారం జ‌రిగింది కూడా. ఆ త‌రువాత కూడా చాలా వ‌ర‌కు కొరియ‌న్ సినిమాల క‌థ‌ల‌ని ఫాలో అయ్యారు. అల్లు శిరీష్ నటించిన `ఒక్క క్ష‌ణం` కూడా కొరియ‌న్ మూవీ `ప్యార్ల‌ల్ లైఫ్‌` ఆధారంగా చేశార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

చిత్ర బృందం మాత్రం ఆ ప్ర‌చారంలో ఎలాంటి వాస్త‌వం లేద‌ని కొట్టి పారేసింది. మాది ఒరిజిన‌ల్ స్టోరీ అని తేల్చి చెప్పింది. ఇక ఇలాంటి స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో కొంత మంది కొరియ‌న్ సినిమాల‌ని రైట్స్ తీసుకుని మ‌రీ తెలుగులో రీమేక్ లు చేయ‌డం మొద‌లు పెట్టారు. స‌మంత కీల‌క పాత్ర‌లో న‌టించిన `ఓ బేబీ` కొరియ‌న్ మూవీ సౌత్ కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ` ఆదారంగా రూపొందిందే. ఇక ఇటీవ‌ల రెజీనా, నివేదా థామ‌స్ క‌లిసి చేసిన `శాకిని డాకిని` ని `మిడ్ నైట్ ర‌న్న‌ర్స్` ఆధారంగా చేశారు.

త్వ‌ర‌లో మ‌రో కొరియ‌న్ సిరీస్ ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నారు. మ‌న ద‌గ్గ‌ర ఎంతో మంది క్రియేటివ్ రైట‌ర్లుండ‌గా కొరియ‌న్ సినిమాలు సిరీస్ లు భారీ మొత్తానికి కొనేసి వాటిని తెలుగులో రీమేక్ లుగా చేయ‌డం ఏంట‌ని, మ‌న ద‌గ్గ‌ర క‌త‌లు లేవా? క‌థ‌లు ఇచ్చేవారు లేరా? అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.