'కాఫీ విత్ కరణ్' లో అయినా బయటపడుతుందా?

Fri May 13 2022 17:00:38 GMT+0530 (IST)

koffee with karan show

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ వరుగా క్రేజీ చిత్రాలు నిర్మిస్తూ మన తెలుగు చిత్రాలకు బాలీవుడ్ లో అండగా నిలుస్తూనే మరో పక్క తనదైన శైలిలో `కాఫీ విత్ కరణ్` పేరుతో టాక్ షోని నిర్వహిస్తున్నారు. సెలబ్రిటీలతో గత కొంత కాలంగా నిర్వహిస్తున్న ఈ టాక్ షో విజయవంతంగా 6 సీజన్ లను పూర్తి చేసుకుంది. అయితే దీనికి సంబంధించిన 7వ సీజన్ వుండదంటూ ఇటీవల కరణ్ జోహార్ ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. ఆ తరువాత వెంటనే అంటే గంటల వ్యవధిలోనే ఇది టెలివిజన్ లో కాకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటూ సర్ ప్రైజ్ ఇచ్చారు.ఈ 7వ సీజన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా వుంటే ఈ 7వ సీజన్ లో దక్షిణాది తారలే ప్రధానంగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ప్రభాస్ నుంచి నయనతార వరకు అంతా దక్షిణాదికి చెందిన క్రేజీ తారలే ఈ సీజన్ లో కనిపించనున్నారని ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. దక్షిణాది నుంచి తొలి పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగిన ప్రభాస్ - అల్లు అర్జున్ లతో ఓ ఎపిసోడ్ ని చేయబోతున్నారట. అంతే కాకుండా వీరిద్దరి మధ్య వున్న స్నేహాన్ని కూడా వీరి అభిమానులకు కరణ్ పరిచయం చేయాలనుకుంటున్నాట.

ఇక `ట్రిపుల్ ఆర్`తో పాన్ ఇండియా స్టార్లుగా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో కూడా ప్రత్యేక ఎపిసోడ్ ని ప్లాన్ చేశారని తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్ కి ముందే వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం వుంది. సినిమా తరువాత అది మరింత బలపడింది. ఆ విషయాలతో పాటు ఫ్యాన్స్ కి తెలియని మరిన్ని సర్ ప్రైజింగ్ అంశాలని వీరి ద్వారా బయటికి తీసుకురాబోతున్నారట. ఇక వీరి తరువాత ముచ్చటగా మూడవ జంటగా సమంత రష్మిక మందన్నలని కరణ్ ఇన్వైట్ చేయబోతున్నారని చెబుతున్నారు.

ఆ తతరువాత విఘ్నేష్ శివన్ - నయనతార జంటని ఆహ్వానిస్తారట. ఈ జంట త్వరలో పెళ్లికి  రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఎంగేజ్ మెంట్ చేసుకున్న విఘ్నేష్ శివన్ - నయనతార జంట కరణ్ షో లో కొత్తగా చెప్పే విషయాలు ఏముంటాయన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా వుంటే `ఫ్యామిలీ మేన్ 2` `ఊ అంటావా మావ ఊహూ అంటావా..` తో సమంత పాన్ ఇండియా వైడ్ గా పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

రష్మిక `పుష్ప` చిత్రంతో పాన్ ఇండియా స్టార్ ల జాబితాలో చేరింది. ఈ ఇద్దరిని కలిపి తన షోకు ఆహ్వానిస్తున్నారట కరణ్ జోహార్. సమంత కూడా ఈ టాక్ షోలో పాల్గొనడానికి ఆసక్తిగా వుందని తెలిసింది. చై తో విడాకుల విషయం ఏమైనా బయటపెడుతుందా? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటీ? .. ఒంటరిగానే వుంటుదా? .. మళ్లీ పెళ్లి ఆలోచన వుందా?  వంటివి చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదన్నది తాజాగా వినిపిస్తోంది. అంతా భావిస్తున్నట్టే ఈ విషయాలు చర్చకు వస్తాయా? లేక ఎప్పటిలాగే కెరీర్ గురించి చెప్పి సామ్ తప్పించుకుంటుందా? అన్నది తెలియాలంటే కరణ్ షో స్ట్రీమింగ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.