బిగుతు దుస్తుల్లో స్టార్ హీరోయిన్ అష్టకష్టాలు

Thu Sep 29 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

kim kardashian struggles to walk in bodyhugging dress

ఏదో ఒక సంచలనం లేనిదే కిమ్ కర్ధాషియన్ కి పూట గడవదు. తాజాగా కిమ్ మిలన్ ఫ్యాషన్ వీక్ లో బాడీ హగ్గింగ్ అల్ట్రా టైట్ డ్రెస్ ధరించి నడవడానికే తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆమె సరిగ్గా నడవలేకపోవడమే కాకుండా మెట్లు ఎక్కడానికి దూకాల్సి వచ్చింది. అటుపై కారు లోపలికి వెళ్లిన తీరు తన సహాయకులు పడుతున్న తంటాలు కూడా వీడియోలో బంధిఖానా అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారింది.హాలీవుడ్ టీవీ హోస్ట్ కం నటిగా.. ఇంటర్నెట్ సంచలనంగా కిమ్ కర్దాషియాన్ సుపరిచితం. తనవైన ఫ్యాషన్ ఎంపికలతో నిరంతరం వార్తల్లో నిలవడం కిమ్ కి కొత్తేమీ కాదు. ఈసారి కూడా విలక్షణమైన దుస్తుల్లో కనిపించి వార్తల్లోకి వచ్చారు. ఇటీవలే ఆమె మిలన్ ఫ్యాషన్ వీక్ కి హాజరై ర్యాంప్ పై కూడా నడవలేని స్థితిలో తన ఉబెర్-టైట్ స్పార్క్లీ డ్రెస్ తో వార్తల్లో నిలిచింది. ఇక వేదిక వద్ద అందరి కళ్లు కిమ్ బాడీ హగ్గింగ్ దుస్తులపైనే.. ఆమె నడవడానికి మెట్లు ఎక్కడానికి కష్టపడుతున్న దృశ్యాన్ని ఎంతో ఫన్నీగా చిత్రీకరించి వీడియో రూపంలో రిలీజ్ చేయడంతో వైరల్ గా మారింది.

వీడియోలో కిమ్ హై హీల్స్ తో వేదిక వద్ద ఆకర్షణీయంగా కనిపించింది. ఆ టైట్ హగ్గింగ్ దుస్తుల్లో నేరుగా నడవలేకపోవడానికి కారణం తన హైహీల్స్ కి బాటమ్ లైన్ చిక్కుకుపోవడమేనని అర్థమవుతోంది. దానిని సరి చేసేందుకు తన అసిస్టెంట్ చాలా శ్రమించాల్సి వచ్చింది. కిమ్ తన కారులో ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంది. ఈ  వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో లక్షలాది వ్యూస్ ని దక్కించుకుంటోంది. కొంతమంది అభిమానులు ఫ్యాషన్ పట్ల ఆమె అంకితభావాన్ని కొనియాడగా... మరికొందరు దీనిని `ఫ్యాషన్ టార్చర్` అని కామెంట్ చేసారు. నిజాయితీగా చెప్పాలంటే ఈ దుస్తుల నడవడానికి సౌకర్యంగా ఉంటే ఇంకా అందంగా కనిపించవచ్చునని సూచించారు వీటన్నింటికీ కారణం ఏమిటి అంటే హింస.. డబ్బు పేరు తలకెక్కింది..అంటూ కొందరు ఘాటుగా వ్యాఖ్యానించారు.

డోల్స్ & గబ్బానా షోకు తనదైన సృజనాత్మకతను జోడించిన కిమ్ మిలన్ ఫ్యాషన్ వీక్ కు అంతకుమించి అనేలా ప్రత్యేక లుక్ తో హాజరయ్యారు. కిమ్ తో పాటు ఆమె సోదరి ఖోలే కర్దాషియాన్ కూడా ఈ కార్యక్రమానికి అటెండైంది. నటుడు మిచెల్ మోరోన్ తో డేటింగ్ పుకార్లకు ఈ వేదిక తెరతీసింది. ఇద్దరూ కలిసి ఒక ఫోటో కోసం ఫోజులివ్వగా ఈ జంట సాన్నిహిత్యంపై అభిమానులను రకరకాలుగా ఊహించుకున్నారు.

అయితే మిచెల్ ప్రతినిధి మాట్లాడుతూ... ఖోలేతో అతనికి  స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని ప్రజలకు చెప్పారు. మరోవైపు  మిచెల్ ను ఇంతకు ముందెన్నడూ కలవని ఖోలే అతనిని మొదటిసారిగా ఫ్యాషన్ వీక్ - మిలన్ లో కలిశారని తెలిసింది.