క్వీన్ కంగనా రనౌత్ ఏటికి ఎదురీదే స్వభావం దేశవ్యాప్తంగా అభిమానుల మనసులను కొల్లగొడుతోంది. సినీ పరిశ్రమతో పాటు రాజకీయాలలో దుందుడుకు చూపిస్తోంది. చాలా విషయాలపై తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొడుతూ నిరంతరం హెడ్ లైన్స్ లో క్వీన్ హీటెక్కిస్తూనే ఉంది.
శత్రువుపై ఎటాక్ చేసే విషయంలో రెండవ ఆలోచన చేయదు. తన సినిమాలతో కంటే వివాదాలతోనే కంగనా తరచుగా మీడియా ముఖ్యాంశాల్లోకి వస్తోంది. ఇంతకుముందే తన చుట్టూ ఏదో గూడుపుటానీ రన్ అవుతోందని కంగన సందేహాలు వ్యక్తం చేసింది. ఒక ప్రముఖ నటుడు తన రహస్యాలను శత్రువులకు చేరవేస్తూ గూఢచర్యం చేసినట్లు గుర్తించానని కంగన తెలిపింది. అయితే ఒక రోజు తర్వాత కంగన రనౌత్ ఇప్పుడు తాను సౌకర్యంగా ఉన్నానని.. తన చుట్టూ ప్రస్తుతం ఎటువంటి అనుమానాస్పద కార్యకలాపాలు లేవని తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కి తెలిపింది. తాజాగా స్టాకర్స్ -ఫిల్మ్ మాఫియా ని కంగన తనదైన శైలిలో హెచ్చరించింది. పాగల్ హు... ఘర్ మే ఘుస్ కే మారుంగి`` అని ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఆదివారం మధ్యాహ్నం క్వీన్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరిలో రెండు సూచనలను షేర్ చేసింది. తన వాట్సాప్ చాట్ లు లీక్ అయ్యాయని పేర్కొంటూ బాలీవుడ్ కు చెందిన ప్రముఖ కాసనోవా అతని భార్య తనపై గూఢచర్యం చేస్తున్నారని ఒక నోట్ లో పేర్కొంది. `అబ్సె సెడ్ మాఫియా నెపో కిడ్` గురించి తన సుదీర్ఘమైన నోట్ లో కంగన రనౌత్ అతడు తనను ఒంటరిని చేసేందుకు మానసిక ఒత్తిడికి గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆమె భావిస్తున్నట్లు పేర్కొంది.
ఈ విషయంపై తాజా పరిణామం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం మరో పోస్ట్ ను కంగన షేర్ చేసింది. స్టాకర్స్ -ఫిల్మ్ మాఫియా కి నా హెచ్చరికలు అంటూ కంగనా ఫిరంగులు విసిరింది.``నా గురించి ఆందోళన చెందుతున్న వారందరికీ తెలియాల్సినది.. దయచేసి గత రాత్రి నుండి నా చుట్టూ ఎటువంటి అనుమానాస్పద కార్యకలాపాలు లేవు. కెమెరాలతోనో లేదా కంటికి కనిపించేలా ఎవరూ నన్ను అనుసరించడం లేదు`` అని తెలిపింది. `` దేఖో జో భూత్ లాతోన్ సే మాంటే హై వో తో సిర్ఫ్ లాతోన్ సే హే మాంటే హైన్`` అని వ్యాఖ్యానించింది. ప్రముఖ బాలీవుడ్ జంట తనపై గూఢచర్యం చేస్తోందని ఆరోపించిన ఒక రోజు తర్వాత కంగనా రనౌత్ తన అభిమానులకు కొత్త అప్ డేట్ చేరవేసింది. తనను వెంటాడేవారిని తాను కనిపెట్టేస్తానని సునాయాసంగా శత్రువు చిక్కుతాడని హెచ్చరించింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... 35 ఏళ్ల కంగన చివరిసారిగా `ధాకడ్`లో కనిపించింది. ఈ భారీ యాక్షన్ చిత్రం డిజాస్టరవ్వడం తనను తీవ్రంగా నిరాశపరిచింది. తదుపరి `ఎమర్జెన్సీ`లో క్వీన్ ఇందిరాగాంధీ పాత్రలో కనిపిస్తుంది. ప్రస్తుతం తన రెండవ తమిళ ప్రాజెక్ట్ `చంద్రముఖి 2` షూటింగ్ లోను బిజీగా ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.