లోకనాయకుడు ఎక్కడ తగ్గట్లేదుగా!

Thu Jul 07 2022 08:00:01 GMT+0530 (IST)

kamal haasan movie news

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆయన నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ `విక్రమ్`. లోకేష్ కనగరాజ్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా ఊహకందని రీతిలో రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుని రికార్డుల మోత మోగిస్తోంది.మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఫహద్ ఫాజిల్ నరేష్ కీలక పాత్రల్లో నటించారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ నటించి ఈ మూవీని నిర్మించారు.

జూన్ 3న వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీ సంచలనాలు సృష్టిస్తోంది. లోకనాయకుడు కమల్ కెరీర్ లోనే అత్యంత భారీ వసూళ్లని రాబట్టిన సినిమాగా నిలిచింది. స్టార్ హీరో సూర్య బ్లాస్టింగ్ కామియో పాత్రలో నటించిన ఈ మూవీ నిజంగా చెప్పాలంటే కమల్ కు ఆయన ఫ్యాన్స్ కు మెమరబుల్ హిట్ ని అందించింది. నాలుగేళ్ల విరామం తరువాత కమల్ చేసిన ఈ మూవీ ఆయన సత్తాని మరోసారి సినీ ప్రపంచానికి చాటింది. డే వన్ నుంచే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రికార్డులు తిరగరాయడం మొదలు పెట్టింది.

విడుదలైన రెండు వారాల్లోనే రూ. 200 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పటికే వరల్డ్ వైడ్ 400 కోట్లకు మించి వసూల్లని రాబట్టింది. తాజాగా మరో రికార్డుని తన ఖాతాలో వేసుకుని రికార్డు సృష్టించింది.

ఇదిలా వుంటే తాజాగా ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ ని సెట్ చేసినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ ని వసూలు చేసిందని ఈ మూవీ విషయంలో ఇదొక మ్యాజిక్ ఫిగర్ అని చెబుతున్నారు.

ఈ సినిమా విజయంతో కమల్ పట్టరాని ఆనందంలో వున్నారు. హిట్టయితే చాలని అనుకున్న ఆయనకు ఈ మూవీ ఊహించని స్థాయిలో కాసుల వర్షం కురిపిస్తూ బ్లాక్ బస్టర్ హిట్ ని అందించడంతో ఇప్పటికీ సెలబ్రేషన్ మోడ్ లోనే వున్నారట. ఈ మూవీ ఫలితంలో దీనికి సీక్వెల్ గా `విక్రమ్ 3` ని కూడా చేయబోతున్నానని అంతా కలిసి వస్తే ఇందులో తమ్ముడు సూర్యతో కలిసి నటిస్తానని కమల్ స్పష్టం చేయడం తెలిసిందే.