హలో బ్యూటీ చలో బాలీవుడ్

Tue Sep 14 2021 05:00:01 GMT+0530 (IST)

kalyani priyadarshan To Bollywood

కొందమంది స్టార్ కిడ్స్ అదృష్టం కొద్ది స్టార్స్ అయితే.. కొందరు మాత్రం ఎంత పెద్ద స్టార్స్ కిడ్స్ అయినా కూడా ప్రేక్షకుల వద్ద గుర్తింపు దక్కించుకునేందుకు పిల్లి మొగ్గలు వేయాల్సి వస్తుంది. వారసులం అంటూ ఎంట్రీ ఇచ్చిన ఎంతో మందిలో కొద్ది మంది మాత్రమే సక్సెస్ లను దక్కించుకుని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. చాలా మంది మాత్రం అదృష్టం కలిసి రాకపోవడంతో అల అలా కెరీర్ ను నెట్టుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి స్టార్ కిడ్స్ అనగానే స్టార్స్ అవుతారు అనే ఒక వాదన ఈమద్య కనిపించడం లేదు. ట్యాలెంట్ ఉంటేనే స్టార్స్ అవుతారు అంటూ పలు సందర్బాల్లో నిరూపితం అయ్యింది. అందుకే కొందరు ఎంట్రీ వరకు తమ పేరెంట్స్ పేర్లు వాడుతున్నా ఆ తర్వాత మాత్రం సొంతంగానే స్టార్ డమ్ ను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.హలో సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన స్టార్ డైరెక్టర్ ప్రియదర్శణ్ కూతురు కళ్యాణి ప్రియదర్శణ్ హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేక పోయింది. అఖిల్ కు జోడీగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఆ తర్వాత చిత్రలహరి మరియు రణరంగం అనే సినిమాలను కూడా కళ్యాణి చేసింది. కాని అవేవి కూడా ఆమెకు సక్సెస్ ను తెచ్చి పెట్టలేదు. ఆమెకు మంచి పేరును తీసుకు రాలేక పోయాయి. అయినా కూడా ప్రయత్నాలు ఆపకుండా సినిమాలు చేస్తూనే ఉంది. తెలుగు తో పాటు తమిళం మరియు మలయాళంలో కూడా ఈమె ప్రయత్నాలు చేసింది. చివరకు ఈమె బాలీవుడ్ కు వెళ్లేందుకు సిద్దం అయ్యింది.

బాలీవుడ్ లో దర్శవకుడు ప్రియదర్శణ్ కు మంచి పేరు ఉంది. అక్కడ చాలా హిట్ సినిమాలను తెరకెక్కించిన ప్రియదర్శణ్ కూతురు అనగానే మేకర్స్ నుండి ఆమెకు మంచి రెస్పాన్స్ అయితే దక్కింది. సౌత్ లో సక్సెస్ కాని వారు ఇక్కడ అదృష్టం కలిసి రాని వారు బాలీవుడ్ లో మంచి సక్సెస్ ను దక్కించుకున్నారు. ఎక్కడికో వెళ్లి పోయారు. అందుకే ఈ అమ్మడు కూడా తన తండ్రి పేరు చెప్పి ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత తన సొంత ట్యాలెంట్ తో అక్కడ స్టార్ గా మారుతుంది అనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ లో వచ్చే ఏడాది వరకు హలో బ్యూటీ కళ్యాణి ప్రియదర్శిణ్ సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.