Begin typing your search above and press return to search.

కాజల్ కి షాక్ ఇచ్చిన ఘోస్టీ..!

By:  Tupaki Desk   |   19 March 2023 6:00 PM GMT
కాజల్ కి షాక్ ఇచ్చిన ఘోస్టీ..!
X
సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ ఆఫ్టర్ మ్యారేజ్ సెకండ్ ఇన్నింగ్స్ కి రెడీ అయ్యింది. గౌతం తో పెళ్లి వెంటనే ప్రెగ్నన్సీ కాజల్ ని రెండేళ్ల పాటు సినిమాలకు దూరం చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ అమ్మడు వరుస సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యింది. సెకండ్ ఇన్నింగ్స్ లో మొదట రిలీజైన ఘోస్టీ ఆమెకు షాకింగ్ రిజల్ట్ ఇచ్చింది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ఘోస్టీ సినిమా పై కాజల్ చాలా హోప్స్ పెట్టుకుంది కానీ సినిమా రిజల్ట్ ఇలా అవుతుందని కాజల్ ఊహించలేదు.

ఇక మరోపక్క కాజల్ లేకపోయినా ఆమె ఓకే చేసిన ఆచార్య కూడా ఫ్లాప్ అయ్యింది. ఆచార్యలో కాజల్ సీన్స్ లేవు కదా అని అనుకోవచ్చు. కొద్దిగా షూట్ చేశాక ఎందుకో కథకి సింక్ అవ్వట్లేదని ఆమె పాత్ర తొలగించారు. అయితే అది కూడా చేసి ఉంటే కాజల్ ఖాతాలో మరో డిజాస్టర్ ఉండేది. ఆఫ్టర్ మ్యారేజ్ కథల విషయంలో కాజల్ పొరపాట్లు చేస్తుందని తెలుస్తుంది. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో అందరి స్టార్స్ తో నటించిన కాజల్ ఇప్పుడు ఇలా కథల ఎంపికలో కన్ ఫ్యూజ్ అవడం ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేస్తుంది.

కాజల్ ఆశలన్ని తర్వాత చేస్తున్న రెండు సినిమాల మీదే ఉన్నాయి. కమల్ తో ఇండియన్ 2 సినిమా చేస్తున్న కాజల్ బాలకృష్ణ 108వ సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది. ఈ రెండు సినిమాలు ష్యూర్ షాట్ హిట్ అనేలా కనిపిస్తున్నాయి. మరి ఈ రెండు సినిమాలతో కాజల్ తిరిగి ఫాం లోకి వస్తుందా లేదా అన్నది చూడాలి. కమర్షియల్ సినిమాలనే కాకుండా కాజల్ ప్రయోగాలు చేయాలని చూస్తుంది. ఆ విషయంలో సమంతని ఫాలో అయితే బెటర్ అని ఫ్యాన్స్ అంటున్నారు.

కళ్యాణ్ డైరెక్ట్ చేసిన ఘోస్టీ సినిమాలో కాజల్ తో పాటుగా యోగిబాబు, కె.ఎస్ రవికుమార్, రెడిన్ కింగ్ స్లీ నటించారు ఈ సినిమాను తెలుగులో నెక్స్ట్ వీక్ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. మరి తమిళ్ లో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగులో అయినా మంచి సక్సెస్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.