డిజాస్టర్ మూవీ తీయడానికి అన్ని కోట్లా..!

Sat Mar 18 2023 15:05:45 GMT+0530 (India Standard Time)

kabzaa movie news

ఎదైనా సినిమా కొత్తగా ఉండి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిందంటే చాలు.. అలాంటి తరహాలోనే సినిమాలను తెరకెక్కిస్తుంటారు చాలా మంది. అయితే అలా తీసి హిట్లు కొట్టేవారు కొందరైతే... బొక్కబోర్లా పడే వాళ్లు మరికొందరు. ఈ కోవకే చెందుతారు కబ్జా చిత్రబృందం. ట్రెండ్ సెట్ చేసిన ఓ పెద్ద సినిమాను అచ్చం అలాగే తీసి అట్టర్ ప్లాప్ ను ఖాతాలో వేసుకున్న ఈ చిత్రబృందం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.విలక్షణ నటుడు కన్నడ మెగా సూపర్ స్టార్ ఉపేంద్ర తాజాగా నటించిన సినిమా కబ్జా గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ చిత్రంలో ఉపేంద్ర సరసన శ్రియా శరణ్ నటిస్తుండగా.. సుదీప్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎంటీబీ నాగరాజ్ సమర్పణలో శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్. చంద్రు దర్శకత్వం వహిస్తున్న కబ్జా సినిమా మార్చి 17వ తేదీ (శుక్రవారం) రిలీజ్ అయింది. కానీ అనుకున్న మేర ఫలితాలను అందించలేకపోయిందీ చిత్రం.

ఇందుకు ప్రధాన కారణం ఈ చిత్రాన్ని అచ్చం బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన కేజీఎఫ్ చిత్రాన్ని పోలి ఉండడం. కేజీఫ్ చిత్రాన్ని పక్కన పెట్టుకొని కథ రాసుకున్నట్లుగా ఉందీ చిత్రం స్టోరీ. ఈ సినిమా చూస్తే అచ్చం కేజీఎఫ్ సినిమా చూసినట్లుగానే అనిపించేలా తెరకెక్కించాడు డైరెక్టర్ ఆర్ చండ్రు. అంతేకాదండోయ్ ఈ కాఫీ కొట్టిన చిత్రానికి వంద కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడం మరింత గమనార్హం. ఇలాంటి సినిమాకు ఇంత పెద్ద మొత్తం డబ్బులు ఎందుకు ఖర్చు చేశారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇదంతా ఒకెత్తు అయితే స్టార్ సీనియర్ హీరో అయిన ఉప్పీ ఈ సినిమాకు ఎలా ఓకే చెప్పారనేది మరో ప్రశ్న.

కేజీఎఫ్ లాంటి స్టీరోయే తాను కావాలనుకున్నాడా లేక యష్ లాంటి క్యారెక్టర్ అతని కంటే తాను బాగా చేయగలనని ప్రూవ్ చేయడానికే ఈ చిత్రం చేశాడా అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. కేజీఎఫ్ ఎలివేషన్లతో ప్రతీ విషయంలోనూ దాన్ని అనుకరిస్తూనే ఈ సినిమా సాగింది. ఎక్కడా ఒరిజినాలిటీ లేకపోవడంతో.. సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది. రెండున్నర గంటల పాటు థియేటర్లో కూర్చోవడం అంటే ప్రేక్షకులకు చాలా కష్టమనే చెప్పాలి. తొలిరోజే ఆడియన్స్ కబ్జా సినిమా చూసి షేకై షాకయ్యారు. కర్టాటకలోనే తొలిరోజు ఈ చిత్రం పది లక్షలు కూడా వసూలు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.