వీడియో: జాన్వీ ఛమక్కులు కళ్లు తిప్పుకోలేరు

Sat Oct 23 2021 15:00:01 GMT+0530 (India Standard Time)

janhvi kapoor Latest Photoshoot

అతిలోక సుందరి గారాల తనయ జాన్వీకపూర్ ఆకాశమే హద్దుగా కెరీర్ ని విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాల్లో వేడెక్కించే ఫోటోషూట్లతో భారీ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇన్ స్టా వేదికగా టెంప్టింగ్  ఫోటోలతో జాన్వీ చెలరేగుతూనే ఉంది. జిమ్..యోగా సెషన్లు..స్కిన్ టైట్ వస్త్రాల్లో జాన్వీ సెగలు సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటాయి.  ఇటీవలే బ్రైడల్ ఏషియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం జాన్వీ  మనోహరిలా  మారిపోయింది. ఔరా అనిపించే లెహంగా లుక్ లో కట్టిపడేసింది. తాజాగా అమ్మడు  ట్రెడిషనల్ లుక్ లో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. టాప్ లో జాకెట్...బాటమ్ లో మ్యాచింగ్ డ్రెస్ ని  ధరించి అందాలతో కైపెక్కిస్తోంది.ప్రస్తుతం ఈ వీడియో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. దీనిపై జాన్వీ ఫాలోవర్స్ ఆసక్తికర కామెంట్లతో హీటెక్కిస్తున్నారు. ఫోటోషూట్ అంటే అంత సులువేమీ కాదని దీనికోసం రకరకాల ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వాల్సి ఉంటుందని జాన్వీ శ్రమ చూస్తుంటే అర్థమవుతోంది. ఇక జాన్వీ  సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కరణ్ జోహార్ బ్యానర్లో  `దోస్తానా-2` లో  నటిస్తోంది. అదే బ్యానర్ లో మరో రెండు చిత్రాలు కమిట్ అయింది. అలాగే అమ్మడు నటించిన `గుడ్ లక్ జెర్రీ` సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. `మిలీ` అనే మరో చిత్రంలో కూడా నటిస్తుంది. వచ్చే ఏడాది ఆ సినిమా రిలీజ్ కానుంది.

ఇక దక్షిణాదిన ఎంట్రీ ఇవ్వడానికి జాన్వీ ఆసక్తిగానే ఉంది. కానీ సరైన ప్రాజెక్ట్  కోసం ఎదురుచూస్తుంది. ఆ ఛాన్స్ వస్తే వదులుకోవడానికి ఎంత మాత్రం సిద్దంగా లేదు. తల్లి తరహాలోనే అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలని ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. గతంలో కొన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ కెరీర్ ప్లానింగ్ లో భాగంగా వాటిపై అశ్రద్ధ చూపింది. కానీ ఇంకా ఆలస్యం చేయకూడదని ఇకనైనా సౌత్ సినిమాలపై కాన్సంట్రేట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. రౌడీస్టార్ విజయ్  దేవరకొండతో కలిసి నటించాలలని ఉందన్న మనసుసలో కోర్కేను సైతం  బయట పెట్టిన సంగతి తెలిసిందే.