రెండు బెస్ట్ రోల్స్ లో 'సలార్' ఒకటి : జగపతిబాబు

Sun Jan 16 2022 17:00:45 GMT+0530 (IST)

jagapathi babu About Salaar Movie

కేజీఎఫ్ సినిమా తో ఒక్కసారిగా జాతీయ స్థాయి లో గుర్తింపు దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈయన దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ 2 విడుదలకు సిద్దం అయ్యింది. కేజీఎఫ్ ను మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ గా కేజీఎఫ్ 2 ఉంటుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. కేజీఎఫ్ 2 ముగించిన వెంటనే దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో అత్యంత భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సలార్ ను పట్టాలెక్కించాడు. ఇప్పటికే సలార్ సినిమా షూటింగ్ దాదాపుగా సగం వరకు పూర్తి అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. గత ఏడాది పరిస్థితులు అనుకూలించి ఉంటే ఈ సంక్రాంతికి సలార్ ను విడుదల చేసేవారు.సలార్ సినిమా లో ప్రభాస్ ద్విపాత్రాభినయం అంటున్నారు. సినిమా లో ప్రభాస్ లుక్ కు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. ఇక ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. సలార్ గురించి జగపతి బాబు మాట్లాడుతూ అంచనాలు భారీగా పెంచాడు. తప్పకుండా ఈ సినిమా అందరిని ఆకట్టుకునేలా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా నచ్చుతుందని ఆయన చెప్పుకొచ్చాడు. సినిమాలోని తన పాత్ర పట్ల దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా శ్రద్దను కలిగి ఉన్నట్లుగా జగ్గూ భాయ్ పేర్కొన్నాడు.

దర్శకుడు ప్రశాంత్ నీల్ తన పాత్రను చూపించే తీరుతో నటుడిగా మరో మెట్టు ఎక్కినట్లుగా భావన కలుగుతుందని పేర్కొన్నాడు. నా బెస్ట్ రెండు పాత్రల్లో సలార్ పాత్ర ఒకటి అన్నట్లుగా జగపతిబాబు బాబు చెప్పుకొచ్చాడు. సలార్ లోని తన పాత్ర అద్బుతంగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు. సలార్ సినిమాలో ప్రభాస్ లుక్ ఇప్పటికే రివీల్ చేశారు. షూటింగ్ కు కరోనా అనుకూలించడం లేదు. అయినా కూడా ఈ ఏడాది చివరి వరకు సలార్ ను విడుదల చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రయత్నాలు చేస్తున్నాడట. కేజీఎఫ్ 2 మరియు సలార్ సినిమాలు కొద్ది తేడాతోనే ప్రేక్షకుల ముందుకు వస్తాయేమో చూడాలి.