Begin typing your search above and press return to search.

రమణ లోడెత్తడానికి 20 ఏళ్ళు పట్టిందట...!

By:  Tupaki Desk   |   2 July 2020 9:50 AM GMT
రమణ లోడెత్తడానికి 20 ఏళ్ళు పట్టిందట...!
X
సినీ ఇండస్ట్రీ లో ఎప్పుడు ఎవరికి స్టార్ డమ్ వస్తుందో చెప్పలేం. కొందరికి సినిమాల ద్వారా పేర్లు వస్తే మరికొందరికి పాత్రల ద్వారా పేరు వస్తుంది.. ఇంకొంత మంది కి మాత్రం ఒకే ఒక్క డైలాగ్ తోనే ఎక్కడ లేని క్రేజ్ వచ్చి పడుతుంది. ఈ క్రమం లో వచ్చిన 'రమణా లోడెత్తాలి రా.. చెక్ పోస్ట్ పడతాది..' అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ''సరిలేరు నీకెవ్వరు'' సినిమాలోని ఈ డైలాగ్ కి నెటిజన్లు వేల కొలది 'టిక్ టాక్' వీడియోలు చేసి తెగ వైరల్ చేసేశారు. ఈ ఒక్క డైలాగ్ తో ఈ ఫైట్ సీన్ లో యాక్ట్ చేసిన వ్యక్తి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. అయితే ఈ గుర్తింపు కోసం అతను 20 ఏళ్లుగా కష్టపడ్డాడు.

'రమణా లోడెత్తాలిరా' డైలాగ్ చెప్పిన నటుడి అసలు పేరు కుమనన్ సేతురామన్. కుమనన్ సేతురామన్ సినిమాల్లోకి రాకముందు సర్వీస్‌ ఇంజినీర్‌ గా ఓ కంపెనీలో పనిచేసేవారట. ఆ తర్వాత సినిమాలపైన ఇష్టంతో అందరూ చెన్నై కి వెళ్తుంటే సేతురామన్ మాత్రం చెన్నై నుంచి వైజాగ్ కి వచ్చారట. ఫోటోగ్రఫీ మీద ఉన్న మక్కువతో స్టైల్ ఫోటోగ్రాఫర్ గా చేశారట. 'మేఘం' అనే సినిమాకి స్టిల్ ఫోటోగ్రాఫర్ గా సినీ కెరియర్ ని మొదలు పెట్టారట. ఇక మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన 'ప్రజారాజ్యం' పార్టీకి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ గా కూడా సేతురామన్‌ పనిచేశారట. చిరంజీవితో ఉన్న పరిచయంతో ఆయనతో కలిసి 'స్టాలిన్' 'సైరా' చిత్రాల్లో నటించే అవకాశం దక్కిందట. వాటితో పాటు 'వెంకీ' 'దైర్యం' 'అల్లుడు శీను' చిత్రాలలో నటించిన కుమనన్ 'అరవింద్ 2' సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు.

ఇక అన్ని చిత్రాలు చేసినా రాని గుర్తింపు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో ఒక్క డైలాగ్ తో కుమనన్ సేతురామన్ కి వచ్చింది. 'రమణా టికెట్ కొనాలిరా.. హౌస్ ఫుల్ బోర్టు పడతాది' అని సినిమాని ప్రమోట్ చేసుకునే రేంజ్ లో ఈ డైలాగ్ పాపులర్ అయింది. ఇటీవల ఒక గేమ్ షో లో తన భార్యతో కలిసి పార్టిసిపేట్ చేసిన కుమనన్ సేతురామన్ తాను ఈ గుర్తింపు తెచ్చుకోడానికి ఎంత కష్టపడ్డాడో చెప్పుకొచ్చాడు. సుమారు 20 ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో ఉంటే 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ద్వారా మంచి పేరొచ్చింది అన్నారు. ఆ ఫైట్ సీక్వెన్స్ లో తన కాలికి గాయమైతే మహేష్ బాబు అతనికి ధైర్యం చెప్పడమే కాకుండా అపోలో హాస్పిటల్ లో తెలిసిన వాళ్ళతో వైద్యం చేయించి సహాయం చేసాడట. ఇక 60 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ రోజూ జిమ్ లో కసరత్తులు చేస్తూ ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు కుమనన్ సేతురామన్.