ఐస్మార్ట్ శంకర్ స్టార్ట్ అయ్యాడు

Wed Jan 23 2019 13:42:54 GMT+0530 (IST)

iSmart Shankar Shooting Start

ఎనర్జిటిక్ హీరో రామ్ దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబోలో ప్రకటించిన ఐస్మార్ట్ శంకర్ ఇవాళ పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలుపెట్టేసుకున్నాడు. మునుపెన్నడూ లేని కొత్త లుక్ లో రామ్ చాలా వెరైటీగా కనిపిస్తుండగా పూరి మార్కు హీరోయిజంతో పాటు చాలా స్పెషల్స్ ఇందులో ఉన్నట్టుగా కనిపిస్తోంది. స్రవంతి రవి కిషోర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా ఛార్మీ క్లాప్ కొట్టింది. కేవలం మూడు నెలల వ్యవధిలో షూటింగ్ పూర్తయ్యేలా ప్లానింగ్ చేసుకున్న పూరి మేలో రిలీజ్ చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నాడు.వేగంగా తీస్తూనే క్వాలిటీ మిస్ కాకుండా చూసుకునే పూరి కొంత గ్యాప్ తర్వాత తన రేంజ్ హిట్ మూవీ ఇదే అవుతుందన్న నమ్మకంతో ఉన్నాడు. ఈ మధ్య రొటీన్ లవర్ బాయ్ పాత్రలతో బోర్ కొట్టేసిన రామ్ ఆశ్చర్యకరమైన రీతిలో ఐస్మార్ట్ శంకర్ కోసం రెడీ అయ్యాడు. చాలా కాలం తర్వాత పూరి మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించడం మరో విశేషం.

టెంపర్ కు పాటలు కంపోజ్ చేయకపోయినా అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో దానికి మణిశర్మ ప్రాణం పోసాడు. ఇప్పుడు మొత్తం బాధ్యత తీసుకోవడంతో పోకిరి రేంజ్ మేజిక్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సత్య దేవ్-పునీత్ ఇస్సార్-ఆశిష్ విద్యార్ధి-మిలింద్ గునాజి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని పూరి అంతా తానై నిర్మిస్తున్నాడు. పాజిటివ్ వైబ్రేషన్స్  ఉన్న టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం రామ్-పూరిలు మొదటిసారి జట్టు కట్టడం విశేషం.