Begin typing your search above and press return to search.

టాలీవుడ్ దర్శకులతో హృతిక్ రోషన్ 'మైత్రీ'

By:  Tupaki Desk   |   5 Feb 2023 11:00 AM GMT
టాలీవుడ్ దర్శకులతో హృతిక్ రోషన్ మైత్రీ
X
ఇండియన్ సూపర్ స్టార్ అంటే వెంటనే హృతిక్ రోషన్ పేరు కచ్చితంగా చెబుతారు. ఈ స్టార్ హీరో ప్రస్తుతం క్రిష్ సిరీస్ లో భాగంగా తండ్రి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇండియన్ సూపర్ హీరో మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. మొదటి మూడు సినిమాలకి రెట్టింపు బడ్జెట్ తో విజువల్ వండర్ గా ఈ సినిమాని రాకేశ్ రోషన్ తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా కల్చర్ మొదలైన తర్వాత సౌత్ దర్శకులతో బాలీవుడ్ హీరోలు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో సక్సెస్ అయ్యి రెండో సినిమాని చేస్తున్నాడు. అలాగే అత్లీ షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా చేస్తున్నాడు. ఇక సల్మాన్ ఖాన్ సౌత్ ఇండియా కాన్సెప్ట్ తో కొత్త సినిమా చేశాడు. అలాగే సౌత్, నార్త్ అని భేదం లేకుండా ఇండియన్ వైడ్ గా ప్రేక్షకులకి రీచ్ అయ్యే కథలు ఎ దర్శకుడితో అయినా చేయడానికి బాలీవుడ్ స్టార్స్ సిద్ధం అవుతున్నారు. ఈ నేపధ్యంలో టాలీవుడ్ నిర్మాతలు కూడా బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ వారు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు అనే వార్తలు వినిపించాయి. ఇక ఈ సినిమాని టాలీవుడ్ దర్శకుడితోనే చేయడానికి సిద్ధమయ్యాయి. అందులో హరీష్ శంకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇదిలా తాజాగా హృతిక్ రోషన్ తో మైత్రీ మూవీ నిర్మాతలు, హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని కలిగి దిగిన ఒక ఫోటో బయటకి వచ్చింది. ప్రస్తుతం హృతిక్ కొత్త సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

ఈ నేపధ్యంలో వీరందరూ అతనిని కలుసుకున్నట్లు తెలుస్తుంది. ఇక సినిమా సిట్టింగ్ కోసం వీరు హృతిక్ రోషన్ ని కలిసినట్లుగా టాక్ వినిపిస్తుంది. అయితే హృతిక్ రోషన్ తో ఉన్న గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్ తో ఎవరితో అతను సినిమా చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఒక వేళ ఆ ప్రాజెక్ట్ సెట్ అయితే దానిని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని టాక్ తెరపైకి వచ్చింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.