పుష్ప 2లో అలాంటి హైలెట్ యాక్షన్ సీక్వెన్స్

Fri Mar 17 2023 06:00:01 GMT+0530 (India Standard Time)

highlight is the action sequence in Pushpa 2

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. పుష్ప మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని మరింత గ్రాండ్ గా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాతో ఏకంగా 1000 కోట్లు గ్రాస్ అందుకోవాలని లక్ష్యంగా అల్లు అర్జున్ పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ మూవీలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.ఇక ఈ పుష్ప 2 సినిమాలో హీరోయిన్ రష్మిక మందన పాత్ర చాలా తక్కువగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ మూవీ షూటింగ్ కోసం సుకుమార్ ఈసారి విదేశాలు వెళ్లారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెరపైకి వచ్చింది. ఈ సినిమా కోసం ఇప్పటికే చిత్రీకరించిన ఒక ఫైట్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా వచ్చింది అని టాక్. ఈ సీక్వెన్స్ మూవీ మొత్తానికి హైలైట్ గా ఉండబోతుందని ప్రచారం నడుస్తుంది.

దాంతోపాటు ఈ మూవీలో అల్లు అర్జున్ స్మగ్లింగ్ డాన్ గా కనిపిస్తాడట. ఈ నేపథ్యంలో మూవీలో బన్నీ చాలా రకాల రిచ్ కాస్ట్యూమ్స్ తో కనిపిస్తాడు అనే మాట వినిపిస్తుంది. అదే సమయంలో ఇంటర్నేషనల్ ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలిమెంట్స్ కూడా మూవీలో చాలా కృషియల్ గా ఉండబోతున్నట్లుగా ఫిలింనగర్ సర్కిల్లో వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి కానుకగా తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అలాగే మూవీ షూటింగ్ ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్. అలాగే వచ్చే నెలలో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 7న ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ముగించుకొని అల్లు అర్జున్ ఈ ఏడాది ఆఖరిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీని స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.