Begin typing your search above and press return to search.

భార‌తీయుడు 2: 100 రెట్లు అవినీతి పెరిగితే 10 రెట్లు చూపిస్తే ఎలా?

By:  Tupaki Desk   |   31 May 2023 9:58 PM GMT
భార‌తీయుడు 2: 100 రెట్లు అవినీతి పెరిగితే 10 రెట్లు చూపిస్తే ఎలా?
X
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ - శంక‌ర్ కాంబినేష‌న్ లో రెండు ద‌శాబ్ధాల క్రితం రిలీజైన `భార‌తీయుడు` (ఇండియ‌న్) ఎలాంటి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. అవినీతి ప్ర‌పంచంపై సేనాప‌తి అనే బ్ర‌హ్మాస్త్రాన్ని సంధించాడు శంక‌ర్. నాటి రోజుల‌తో పోలిస్తే నేడు రాజ‌కీయ నాయ‌కుల్లో అధికారుల్లో అవినీతి వంద రెట్లు పెరిగిందే కానీ కించిత్ కూడా ఎక్క‌డా త‌గ్గ‌లేదు.

అమాంతం పెరిగిన అవినీతి ప్ర‌పంచంపై సేనాప‌తి ఎలాంటి పోరాటం సాగించాడ‌న్న‌ది పెద్ద తెర‌పైనే చూడాల‌న్న ఉత్కంఠ భార‌తీయుడు అభిమానుల్లో ఉంది. సీక్వెల్లో శంక‌ర్ ఎలాంటి భావోద్వేగాల‌ను ట‌చ్ చేస్తున్నాడు? అత‌డు ఏ త‌ర‌హా మ‌సాలాను ద‌ట్టించాడు? అన్న‌ది ఉత్కంఠ‌గా మారింది. అంతేకాదు.. ఈ సినిమా ఆరంభం నుంచి ప‌దే ప‌దే ర‌క‌ర‌కాల ఇబ్బందులు ఆటంకాల‌తో షూటింగ్ కొన‌సాగుతోంది కాబ‌ట్టి దీని బ‌డ్జెట్ రేంజ్ కూడా అమాంతం పెరిగింద‌న్న చ‌ర్చ సాగుతోంది.

ప్ర‌స్తుతం భార‌తీయ‌డు 2 చిత్రీక‌ర‌ణ‌ను వేగంగా పూర్తి చేసేందుకు శంక‌ర్ చేయాల్సిన ప్ర‌య‌త్నాల‌న్నీ చేస్తున్నారు. ఓవైపు రామ్ చ‌ర‌ణ్ తో గేమ్ ఛేంజ‌ర్ పూర్తి చేస్తూనే భార‌తీయుడు 2 (ఇండియ‌న్ 2) షెడ్యూళ్ల పైనా శంక‌ర్ ఫోక‌స్ చేసారు. ఇంత‌కీ భార‌తీయుడు 2 ఎలా ఉండ‌బోతోంది? అన్న ప్ర‌శ్న‌కు కీల‌కమైన అప్ డేట్ అందించాడు సిద్ధార్థ్.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో భార‌తీయుడు 2లో కీల‌క పాత్ర‌ను పోషిస్తున్న హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ.. భార‌తీయుడు కంటే సీక్వెల్ సినిమా (భార‌తీయుడు 2) ప‌దింత‌లు పెద్ద‌దిగా ఉంటుంద‌ని .. అది విజువ‌ల్ గా ఎలా ఉంటుందో మీ ఊహ‌కే వ‌దిలేస్తున్నాన‌ని కాన్ఫిడెంట్ గా చెప్పారు. భార‌తీయుడు 2 త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ అని సిద్ధార్థ్ వ్యాఖ్యానించాడు. తన కొత్త సినిమా టక్కర్‌ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో సిద్ధార్థ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ``శంకర్‌ సార్‌ నన్ను సినిమా ప్రపంచానికి పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

నన్ను లాంచ్‌ చేసిన అదే గొప్ప దర్శకుడు మళ్లీ నన్ను నమ్మి మరో ప్రాజెక్ట్ కోసం పిలిచారు. నా ప్రతిభను ఆయ‌న న‌మ్మారు. ఆయ‌న నుంచి కాల్ రాగానే నేను స్పష్టంగా మాట్లాడకుండా ఉండిపోయాను. అది కూడా ఈ రోజు దేశంలోని అతిపెద్ద సినిమాల్లో ఒకటైనందుకు...!`` అని అన్నాడు. నేను సినిమా గురించి మాట్లాడటం మొదలుపెడితే కనీసం రెండు నెలల పాటు దాని గురించి మాట్లాడవచ్చని సిద్ధార్థ్ అన్నాడు. శంకర్ సార్ ఎలాంటి లీకులు వద్దని స్పష్టంగా చెప్పారని కూడా సిద్ధార్థ్ అస‌లు విష‌యం చెప్పారు.

నా కంటే ఎక్కువగా ఈ చిత్రం మరో ఇద్దరు ప్రముఖుల గురించి..కమల్ హాసన్ సార్ - శంకర్ సార్. కమల్ హాసన్ సర్ తో కలిసి పనిచేయాలనేది ఎప్పటి నుంచో నా కల. ఈ చిత్రం మీరు ఊహించిన‌దానికంటే 10 రెట్లు పెద్దదిగా ఉంటుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఎలా ఉంటుందని ఊహించుకోండి`` అంటూ సిధ్ టీజ్ చేసాడు. సిద్ధార్థ్ న‌టించిన ట‌క్క‌ర్ త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.