మరో స్టార్ హీరోని పట్టిన అజిత్ డైరెక్టర్

Wed Jan 25 2023 09:00:01 GMT+0530 (India Standard Time)

h vinoth vijay milton talks about kamalhaasan project

లోక నాయకునిగా పేరు ఉన్న కమలహాసన్ తన సినీ కెరియర్లో దాదాపు 240 పైగా సినిమాల్లో నటించారు. స్టార్ హీరోగా కొనసాగుతూ తెలుగు తమిళ భాషల్లో అనేక సినిమాల్లో నటించిన కమల్ హాసన్... చాలా రోజుల పాటు సరైన హిట్ కూడా లేకుండా ఇబ్బంది పడ్డారు. అయితే 2022 లో వచ్చిన విక్రమ్ సినిమా ఆయన కెరియర్ లోని భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో ఏజెంట్ విక్రమ్ పాత్రలో ఆయన నటించారు.బ్లాక్ స్క్వాడ్ అనే ఒక ఇంటలిజెన్స్ అధికారిగా ఆయన కనిపించారు. దాదాపుగా 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి ఏ మాత్రం సత్తా తగ్గలేదని ఆయన నిరూపించుకున్నారు. ఇక ప్రస్తుతానికి శంకర్ దర్శకత్వంలో ఆయన ఇండియన్ 2 అనే సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో 90 లలో వచ్చి భారతీయుడు అనే సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ పార్ట్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ అయితే జరుగుతోంది.

వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. కానీ సినిమా షూటింగ్లో ఉండగా క్రేన్ ప్రమాదం జరిగి కొందరు యూనిట్ సభ్యులు మరణించారు. ఆ సమయంలోనే కమల్ హాసన్ ఎందుకో శంకరకు దూరమయ్యారు. వీరిద్దరి మధ్య దూరం పెరుగుతూ రావడంతో షూటింగ్ కూడా నిలిచిపోయింది. అయితే ఈ మధ్యనే నిర్మాణ సంస్థల ఐక్య ప్రొడక్షన్స్ వారిద్దరి మధ్య సాయోద్య కుదర్చడంతో మళ్లీ షూటింగ్ మొదలైంది.

ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు విలక్షణ సినిమాలు దర్శకుడు హెచ్ వినోద్ డైరెక్షన్లో కమల్ హాసన్ ఒక సినిమా చేయబోతున్నారు. కమల్ హాసన్ కెరియర్ లో అది 203 వ సినిమా గా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అజిత్తో నెరకొండ పారువాయి వలిమై లాంటి సినిమాలు తీసి సూపర్ హిట్ అందుకున్న వినోద్ చెప్పిన కథకు కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజ్ దులిమ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సినిమాని నిర్మించబోతున్నట్లుగా సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.