మధు హీరోగా `గుండె కథ వింటారా` లిరికల్ సాంగ్ `ఎంత బావుందో`

Wed Apr 21 2021 11:14:19 GMT+0530 (IST)

gunde jaari gallanthayyinde fame madhu debut movie

నితిన్ తో కలిసి  `గుండే జారి గల్లంతయ్యిందే` చిత్రంలో రెండో కథానాయకుడిగా కనిపించారు మధునందన్. ఒక మంచి ఆర్టిస్ట్ కం  కమెడియన్ గా మధునందన్ పెద్ద సక్సెసవ్వడమే గాక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీ అయ్యారు. 2014 నుంచి ఇప్పటివరకూ పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో మధు ఇంపార్టెంట్ పాత్రల్లో నటించారు.నాగ చైతన్యతో కలిసి ఒక లైలా కోసంలో ఆల్మోస్ట్ సెకండ్ హీరోలా కనిపిస్తారు మధు. అలాగే విజయ్ దేవరకొండతో కలసి టాక్సీవాలా లోనూ చాలా ఇంపార్టెంట్ పాత్రలో కనిపించారు. ఇష్క్-గీతాంజలి-టాక్సీవాలా తదితర విజయవంతమైన సినిమాల్లో నటించిన మధునందన్ ఇప్పుడు హీరోగా మారుతున్నారు. `గుండె కథ వింటారా` అనే థ్రిల్లర్ మూవీతో హీరోగా పరిచయమవుతున్నారు.

ఈ సినిమా నుంచి ఎంత బావుందో సాంగ్ ని విజయ్ దేవరకొండ చేతులమీదుగా నేటి ఉదయం 10.04గంటలకు రిలీజ్ చేశారు. ఎంత బావుందో లిరికల్ సాంగ్ ఆద్యంతం ఆహ్లాదమైన బాణీతో ఆకట్టుకుంటోంది. కృష్ణ చైతన్య ఈ పాటకు లిరిక్స్ అందించారు. కృష్ణ జేకే- వరుణ్ సునీల్ ఆలపించారు. మసాలా కాఫీ టీమ్ సంగీతం అందించింది.

గుండె కథ వింటారా థ్రిల్లర్ మూవీ. వంశీధర్ రచించి దర్శకత్వం వహిస్తున్నారు. ట్రినిటీ పిక్చర్స్ బ్యానర్ పై క్రాంతి మంగళంపల్లి- అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టైటిల్ పోస్టర్ ని ఇంతకుముందు అడివి శేష్ లాంచ్ చేశారు. మధునందన్ సరసన స్వాతిస్ట కృష్ణన్- శ్రేయ నవిలే నాయికలు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హీరోగా మధు సక్సెస్ సాధించాలని ఆకాంక్షిద్దాం.