గూఢచారి 2 స్క్రిప్ట్ రెడీ కాకుండా ఆ పని ఎలా చేశారు?

Wed Feb 08 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

goodachari 2 movie news

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ మేజర్ మరియు హిట్ 2 సినిమాలతో సక్సెస్ ను దక్కించుకున్నాడు. ముఖ్యంగా మేజర్ సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ ను దక్కించుకోవడంతో పాటు అన్ని చోట్ల కూడా అడవి శేష్ గుర్తింపు సొంతం చేసుకున్నాడు.హిట్ 2 కి మేజర్ సినిమా తో వచ్చిన పాపులారిటీ బాగా ఉపయోగపడింది. సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అడవి శేష్ కు మేజర్ తో దక్కిన ఇమేజ్ ను హిట్ 2 మేకర్స్ సద్వినియోగం చేసుకోలేక పోయారు. అలా చేసుకుని ఉంటే మరింత వసూళ్లు నమోదు అయ్యేవి. ఇప్పుడు గూఢచారి సినిమా సీక్వెల్ తో పాన్ ఇండియా రేంజ్ లో సందడి చేసేందుకు శేష్ రెడీ అవుతున్నాడు.

గూఢచారి సినిమా తెలుగు లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సీక్వెల్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. అడవి శేష్ కి నార్త్ లో ఉన్న క్రేజ్ నేపథ్యంలో సీక్వెల్ ను అక్కడ ఎక్కువగా ప్రమోట్ చేయడం జరుగుతుందట.

ఇటీవలే సినిమా యొక్క ఓపెనింగ్ జరిగింది.. అంతే కాకుండా ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను షేర్ చేశారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గూఢచారి సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి అవ్వలేదట. స్క్రిప్ట్ వర్క్ పూర్తి అవ్వడానికి ఇంకా చాలా సమయం పడుతుందని టాక్ వినిపిస్తుంది.

స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాకుండా ఎలా సినిమా ఓపెనింగ్ చేశారు అనేది చర్చనీయాంశం అయ్యింది. బాలీవుడ్ మీడియాలో ఇప్పటి నుండే గూఢచారి 2 సినిమా గురించి ప్రచారం జరగాలనే ఉద్దేశ్యంతో స్క్రిప్ట్ వర్క్ పూర్తి అవ్వకుండానే ఓపెనింగ్ చేసి హడావుడి మొదలు పెట్టారు. ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంట్ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.