మెగాస్టార్ సినిమా.. నందమూరి హీరో కంటే తక్కువే..

Fri Jan 27 2023 20:23:29 GMT+0530 (India Standard Time)

god father and bimbisara TRP rating

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజాస్టర్ కాకపోయిన కూడా సేఫ్ జోన్ కలెక్షన్స్ తో బయటపడింది. లూసీఫర్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. చిరంజీవి మొదటి సారి ఈ సినిమాలో కాస్తా డిఫరెంట్ పాత్రలో కనిపించారు. అయితే ఆ పాత్ర చిరంజీవికి సెట్ కాలేదనే మాట వినిపించింది.అయితే మూవీ సక్సెస్ మీట్ మాత్రం చేయడంతో పాటు అవకాశం ఉంటే గాడ్ ఫాదర్ సీక్వెల్ కూడా చేస్తానని ఆ సమయంలో చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే వాల్తేర్ వీరయ్య సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఇకపై తనని ప్రేక్షకులు కోరుకొని పాత్రలు చేయనని పూర్తిగా మాస్ కమర్షియల్ చిత్రాలు మాత్రమే చేస్తానని చిరంజీవి చెప్పారు. దీనిని బట్టి గాడ్ ఫాదర్ సీక్వెల్ ఉండదని క్లారిటీ ఇచ్చినట్లు అయ్యింది. ఇదిలా ఉంటే గాడ్ ఫాదర్ మూవీ ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా బుల్లితెరలో ప్రసారం అయ్యింది.

పండగ ప్రీమియర్ గా ఈ మూవీని జెమినీ టీవీలో ప్రదర్శించారు. అయితే ఈ సినిమాకి బుల్లితెరపై ఊహించని రేటింగ్ వచ్చింది. కేవలం 7.69 రేటింగ్ మాత్రమే సొంతం చేసుకుంది. అయితే అంతకు ముంది కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ 11.5 టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకుంది. కళ్యాణ్ రామ్ కెరియర్ లో హైయెస్ట్ రేటింగ్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే గాడ్ ఫాదర్ సినిమా దానికంటే లోగా సంక్రాంతి సీజన్ లో కూడా తక్కువ టీఆర్పీ రేటింగ్ వచ్చింది.

ఓ విధంగా చెప్పాలంటే చిరంజీవి కెరియర్ లో ఇది డిజాస్టర్ రేటింగ్ అని చెప్పాలి. అయితే డిజిటల్ లో సినిమాలు రిలీజ్ అవుతున్న తర్వాత శాటిలైట్ లో సినిమాలు చూసే వారు క్రమంగా తగ్గిపోయారు. ఈ నేపధ్యంలో హిట్ సినిమాలకి కూడా బుల్లితెరపై తక్కువ టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా కూడా సినిమా రిలీజ్ అయిన 15 రోజుల్లోనే ఒటీటీలో కూడా రిలీజ్ అయిపొయింది. ఈ నేపధ్యంలో టీఆర్పీ రేటింగ్ కూడా ఎఫెక్ట్ పడిందని చెప్పాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.