లంబసింగిలో గీతా వారి షూటింగ్ ప్లాన్స్..?

Thu Jul 07 2022 09:27:26 GMT+0530 (India Standard Time)

geetha arts shooting plans in Lambasinghi

ఓవైపు విలక్షణమైన కథలతో కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు నిర్మిస్తూనే.. మరోవైపు పక్కా కమర్షియల్ చిత్రాలను రూపొందిస్తున్న నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్. ఇటీవల తమ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 8 చిత్రాన్ని హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసిన విషయం తెలిసిందే.ఇందులో శివాని రాజశేఖర్ - శ్రీకాంత్ మేక మరియు రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 'జోహార్' 'అర్జున ఫల్గుణ' లాంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న తేజ మార్ని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో నర్సీపట్నం సమీపంలోని లంబసింగి ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోందని సమాచారం.

లంబసింగి అనేది వైజాగ్ పరిసరాల్లోని అందమైన ప్రాంతాల్లో ఒకటి. 'కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' గా పిలుస్తుంటారు. వేసవి కాలం - చలికాలంలో అత్యంత ఎక్కువమంది వీక్షించే ప్రదేశమిది.

అలాంటి బ్యూటీఫుల్ లొకేషన్స్ లో జీఏ2 టీమ్ తమ ప్రొడక్షన్ నెం.8 కోసం ఓ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తిగా కంటెంట్ ప్రధానంగా సాగే సినిమా అని మేకర్స్ ఇది వరకే తెలిపారు.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. మురళీ శర్మ - బెనర్జీ - పవన్ తేజ్ కొణిదెల తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీవాసు మరియు విద్య మాధురి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భాను ప్రతాప్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు.

జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

అయితే ఇది మలయాళంలో ఘనవిజయం సాధించిన 'నాయట్టు' చిత్రానికి రీమేక్ అనే టాక్ వినిపిస్తోంది. గతంలో గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై ఈ రీమేక్ సినిమాని ప్రారభించిన సంగతి తెలిసిందే. అదే చిత్రాన్ని వేరే టీమ్ తో చేస్తున్నారని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.