Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్.. మనోళ్ళు హార్ట్ అయ్యారు!

By:  Tupaki Desk   |   27 March 2023 6:01 PM GMT
గేమ్ చేంజర్.. మనోళ్ళు హార్ట్ అయ్యారు!
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి గేమ్ చేంజర్ అనే టైటిల్ ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీకి సంబందించిన టైటిల్ ప్రోమోని రిలీజ్ చేశారు.

శంకర్ స్టైల్ లో చాలా క్రియేటివ్ గా ఈ టైటిల్ ప్రోమో ఉండటంతో సోషల్ మీడియాలో భాగానే వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ ని తమిళంలో అయితే ఒక్క టైటిల్ తప్ప మిగిలిన పేర్లు అన్ని కూడా తమిళ్ లోనే రాశారు.

అయితే మిగిలిన భాషలకి వచ్చేసరికి టైటిల్ తో పాటు మిగిలిన క్రూ పేర్లు అన్ని కూడా ఇంగ్లీష్ లో రాసాను దీనిపై కొంతమంది సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. అంటే తెలుగు వాళ్ళ కోసం పోస్టర్ లో పేర్లు తెలుగులో రాయకూడదా. తమిళ్ లో పోస్టర్ ని తమిళ్ భాషలో పేర్లు రాసినపుడు మరి తెలుగులో కూడా రాయాలి కదా అని ప్రశ్నిస్తున్నారు.

తెలుగు వాళ్ళు అంటే చిన్న చూపా లేకా తెలుగు భాష అంటే చిన్న చూప అని కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం. నిజానికి తమిళ్ భాషలో తెరకెక్కే సినిమాలకి పోస్టర్ లో పేర్లు తమిళంలోనే వేస్తారు. దీనికి కారణం వారు తమిళ్ భాషకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఒక వేళ పేర్లు మాతృభాషలో లేకపోతే దానిని అసలు ఓన్ చేసుకోవడానికి కూడా ఇష్టపడరు.

ఇది శంకర్ కి భాగా తెలిసే అలా ఒక పోస్టర్ ని తమిళ్ పేర్లతో రిలీజ్ చేసి మరో పోస్టర్ ని ఇంగ్లీష్ పేర్లతో రిలీజ్ చేశారు. పోస్టర్ లుక్ మెగా ఫ్యాన్స్ కి కనెక్ట్ కావడంతో అభిమానుల వరకు ఈ విషయాన్ని పట్టించుకోరు కాని తెలుగు భాష మీద అభిమానులు ఉన్నవారు మాత్రం వివాదం చేసే ప్రయత్నం చేస్తారు అని చెప్పాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.