గేమ్ చేంజర్ వచ్చేది అప్పుడేనా?

Mon Mar 27 2023 21:56:33 GMT+0530 (India Standard Time)

game changer RC15 movie Mystery Release

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చెర్రి బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ ప్రోమో ఫస్ట్ లుక్ ని తాజాగా రిలీజ్ చేశారు. గేమ్ చేంజర్ అనే టైటిల్ ని ఈ మూవీకి కన్ఫర్మ్ చేశారు. అయితే టైటిల్ కాస్తా కొత్తగానే ఉన్న ఇంగ్లీష్ లో ఉందనే మాట వినిపిస్తుంది.రామ్ చరణ్ కి పెర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యే టైటిల్ ని శంకర్ పెట్టాడని కొంతమంది మెగా అభిమానులు అంటున్నారు. ఇదిలా ఉంటే టైటిల్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన కూడా ఈ మూవీ రిలీజ్ డేట్ ని మాత్రం శంకర్ కన్ఫర్మ్ చేయలేదు. నిజానికి ఈ ఏడాదిలోనే మూవీ  రిలీజ్ కావాల్సి ఉంది. అయితే షూటింగ్ అయితే పూర్తి కాలేదు.

ఈ నేపధ్యంలో సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కాని ఆ సమయంలో శంకర్ ఇండియన్  2 మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు దిల్ రాజు డిస్టిబ్యూషన్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ నేపధ్యంలో గేమ్ చేంజర్ రిలీజ్ పై చిత్ర యూనిట్ కన్ఫర్మ్ ఇవ్వలేదు.

అయితే టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఆ టైమ్ లో అయితే సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎక్కువ మంది థియేటర్స్ కి వచ్చే అవకాశం ఉంటుందని ఆలోచిస్తున్నారు.

అయితే ఈ విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తుంది. ఇక శంకర్ దిల్ రాజు డిసైడ్ అయ్యి త్వరలో రిలీజ్ డేట్ ని మరోసారి ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇండియన్ 2 రిలీజ్ డేట్ బట్టి గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ ఉండే అవకాశం ఉందని ప్రచారం నడుస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.