దివంగత TNR కుటుంబానికి ధాతృ విరాళాలు

Wed May 12 2021 15:04:04 GMT+0530 (IST)

donations to the late TNR family

యూట్యూబ్ వ్యాఖ్యాత.. ఫిల్మ్ జర్నలిస్టు.. నటుడు టీఎన్‌ఆర్ (తుమ్మల నరసింహారెడ్డి) ఇటీవల కరోనా కారణంగా తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. టీఎన్ ఆర్ ఆకస్మిక మృతికి సినీప్రపంచం షాక్ కి గురైంది. దాదాపు 150 పైగా యూట్యూబ్ ఇంటర్వ్యూలు చేసిన ఆయన మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేయాలని ఉత్సాహంగా ఉన్నారు.



ఇక టీఎన్నార్ మరణం గురించి తెలుసుకున్న అనంతరం తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ చిరు 1లక్ష విరాళం అందించారు. అలాగే టీఎన్నార్ ఇంటర్వ్యూ వల్లనే తాను ఎదిగానని ప్రకటిస్తూ సంపూర్ణేష్ బాబు 50 వేల విరాళం ఇచ్చారు. సినీక్రిటిక్స్ సహా జర్నలిస్టుల సంఘాలు తమ సంతాపం ప్రకటించాయి.

తాజాగా ప్రైమ్ షో ఎంటర్‌టైన్ మెంట్ తమ వంతు ఆర్థిక సహాయంగా 1లక్ష రూపాయలను ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రైమ్ షో ప్రతినిధులు మాట్లాడుతూ -  ``టీ.ఎన్.ఆర్ మృతిచెందారనే దుర్వార్త మమ్మల్ని ఎంతగానో కలచి వేసింది. చాలా బాధపడుతున్నాము. ఈ దురదృష్టకర సంఘటనను మేము ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం. టీ.ఎన్.ఆర్ మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మా వంతుగా వారి కుంటుంబనికి ఆర్ధిక సహాయంగా లక్ష రూపాయలు ప్రకటిస్తున్నాం. టీఎన్‌ఆర్ ఆత్మకు శాంతి చేకూరాలి`` అన్నారు.