Begin typing your search above and press return to search.

దసరా దర్శకుడి పెళ్లి.. ముచ్చటైన జంట!

By:  Tupaki Desk   |   31 May 2023 10:03 PM GMT
దసరా దర్శకుడి పెళ్లి.. ముచ్చటైన జంట!
X
సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఒదేల దసరా సినిమాతో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమానే ఏకంగా వంద కోట్ల ప్రాజెక్ట్ గా అరుదైన రికార్డ్ ని ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రియేట్ చేశాడు. సుకుమార్ టీమ్ నుంచి వచ్చిన బుచ్చిబాబు, కార్తీక్ దండుకి సాధ్యం కాని ఘనతని శ్రీకాంత్ సొంతం చేసుకున్నాడు.

దీంతో ఇప్పుడు శ్రీకాంత్ ఒదేలకి ఫుల్ డిమాండ్ ఉంది. బడా నిర్మాతలు అందరూ కూడా శ్రీకాంత్ తో సినిమాలు చేయడం కోసం ఆసక్తి చూపిస్తున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అఖిల్ అక్కినేని హీరోగా చేయాలని శ్రీకాంత్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కుర్ర దర్శకుడు తాజాగా పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు.

కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో శ్రీకాంత్ ఒదేల పెళ్లి వైభవంగా జరిగింది. దీనికి కొంతమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. నిజానికి నేచురల్ స్టార్ నాని కూడా ఈ పెళ్ళికి వెళ్ళాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నాని ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ లో పూణేలో ఉన్నారు. రీసెంట్ గా ఢిల్లీలో తన కొత్త మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని నేరుగా యాడ్ కోసం పూణే వెళ్ళారు.

ఈ కారణంగా శ్రీకాంత్ ఒదేల పెళ్ళికి అతను హాజరుకాలేదు. అయితే శ్రీకాంత్ కి ప్రత్యేకంగా విషెస్ తెలియజేసినట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి దర్శకుడు కావాలనే తన కలని నెరవేర్చుకొని మొదటి చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి ఇప్పుడు పెద్దలు కుదిర్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని కొత్తజీవితం స్టార్ట్ చేశాడు. ఇదిలా ఉంటే శ్రీకాంత్ తో బడా ప్రొడక్షన్ కంపెనీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతుందని టాక్ వినిపిస్తోంది.

సుకుమార్ టీమ్ నుంచి బయటకొచ్చి, గురువు సహకారం లేకుండా శ్రీకాంత్ ఒదేల దసరా సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఈ కారణంగా అతనికి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇక ఇతని పెళ్లి వేడుకకి సుకుమార్ టీమ్ సభ్యులు హాజరు అయినట్లు తెలుస్తోంది.