శంకర్ డ్రీమ్ లో హృతిక్ రోషన్-రామ్ చరణ్!

Thu Jul 07 2022 07:00:02 GMT+0530 (India Standard Time)

director shankar on hrithik roshan and ram charan

దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ కి రంగం సిద్దమవుతోందా? ఆ డ్రీమ్ ని ఫుల్ పిల్ చేసేది ఆ ఇద్దరేనా?  ఆ  ఇద్దరిపై 1000 కోట్ల బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీకే సన్నాహాలు చేస్తున్నారా? అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. ఇంతకీ శంకర్ డ్రీమ్ ఏంటి?  ఆ డ్రీమ్ లో ఆ ఇద్దరు స్టార్లు ఎవరు?  అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.అండర్ వాటర్ సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన విజువల్ ట్రీట్ గా  ఓ సినిమా తెరకెక్కించాలని శంకర్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. అద్భుతమైన విజువల్ వండర్ గా...అండర్ వాటర్ అడ్వెంచర్ చిత్రంగా రూపొందించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ బడ్జెట్ పరంగా  శంకర్ హైట్స్ ని సాధ్యం కాదు కాబట్టి ఇన్నాళ్లు ఆ ప్రాజెక్ట్ ని పక్కనబెట్టేసారు.

1000 కోట్లుపైనే ఆ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి వెచ్చించాల్సి ఉంది. దీంతో అది ఇప్పట్లో కష్టమని  భావించి నిర్మాణ సంస్థల పరిధిలోనే సినిమాలు చేస్తూ వచ్చారు. అయితే ఇటీవలి కాలంలో దక్షిణాది సినిమా నిర్మాణ వ్యయం స్కైని టచ్ చేస్తోన్న సంగతి  తెలిసిందే. `కేజీఎఫ్`..`బాహుబలి`..`ఆర్ ఆర్ ఆర్` లాంటి సినిమాలకు ఎంత ఖర్చు చేయడానికైనా నిర్మాణ సంస్థలు వెనుకడుగు వేయిన వైనాన్ని గమనిస్తే సౌత్ సినిమా స్థాయి అర్ధమవుతుంది.

నిర్మాణ సంస్థల్లో వచ్చిన మార్పులతోనే స్టార్ మేకర్ మణిరత్నం సైతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియన్ సెల్వన్` ని ఎట్టకేలకు పట్టాలెక్కించగలిగారు. వందల కోట్ల రూపాయల్ని నిర్మాణ సంస్థలు సునాయాసంగా ఖర్చు చేస్తున్నాయి. క్వాలిటీ విషయంలో  ఏమాత్రం తగ్గడం లేదు. ఆడియన్ కి  థియేటర్లో ది బెస్ట్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి తాపత్రయ పడుతున్నాయి.

ఇలా నిర్మాణ సంస్థల్లో వచ్చిన మార్పులతోనే శంకర్ కూడా తన డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. ఈ  చిత్రాన్ని పాన్ వరల్డ్ లో తెరకెక్కించాలన్నది  ప్లాన్ గా కనిపిస్తుంది. ఇందులో  బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే శంకర్ రాసుకున్న పాత్రలకి పర్పెక్ట్ గా యాప్ట్ అవుతారని భావిస్తున్నారుట.

ఆ రెండు పాత్రలు ఎంతో సవాల్ తో..సాహసోపేతంగా సాగే విధంగా ఉంటాయని  కోలీవుడ్ నుంచి  లీకులందుతున్నాయి. శంకర్ ఆస్థాన రైటర్లతోనే స్ర్కిప్ట్ ని సిద్దం చేయిస్తున్నట్లు తెలిసింది. దాదాపు షూట్ అంతా ఓ స్టూడియోలోనే ఉంటుందని...అందుకోసం ప్రత్యేకమైన బ్లూ మ్యాట్ తయారు చేసి అద్భుతమైన దృశ్య రూపం ఇచ్చేలా బ్యాకెండ్ వర్క్ జరుగుతుందని సమాచారం. మరి ఈ ప్రచారంలో వాస్తవాలు ఎంటి? అన్నది శంకర్ రివీల్ చేస్తే తప్ప క్లారిటీ రాదు. ప్రస్తుతం శంకర్ తో చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.