Begin typing your search above and press return to search.

మారుతితో ప్రభాస్.. ఒక్కటే!

By:  Tupaki Desk   |   31 May 2023 6:16 PM GMT
మారుతితో ప్రభాస్.. ఒక్కటే!
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గ్యాప్ లేకుండా ప్రస్తుతం అతిపెద్ద సినిమాల షూటింగ్ లను ఫినిష్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక సినిమా షెడ్యూల్ పూర్తవగానే ప్రభాస్ ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా వెంటనే మరొక సినిమా షెడ్యూల్లో బిజీ బిజీగా పాల్గొంటున్నాడు. ఇప్పుడు ఇండియా మొత్తంలో కూడా అత్యధిక భారీ బడ్జెట్ సినిమాలను లైన్లో పెట్టిన ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే అని చెప్పవచ్చు.

ఇక ఎవరూ ఊహించిన విధంగా ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక భయపెట్టే సినిమాను కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఈ సినిమాపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వక పోయినప్పటికీ కూడా సినిమా షూటింగ్ పనులు అయితే యధావిధిగా కొనసాగుతున్నాయి. మంచి అప్డేట్స్ ద్వారానే సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయాలి అని దర్శకుడు మారుతి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన చాలా సన్నివేశాలను కూడా పూర్తి చేశారు. అవుట్ ఫుట్ పై ప్రభాస్ కూడా చాలా కాన్ఫిడెంట్ గానే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా తెరపైకి తీసుకురాబోతున్నట్లుగా గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కథ ఎక్కువగా రావడంతో మారుతి ఈ విధంగా ప్రణాళిక రచించినట్లుగా టాక్ వచ్చింది.

అయితే అందులో ఎలాంటి నిజం లేదట. కేవలం ఒక సినిమాగానే రాజా డీలాక్స్ రానుందని చిత్ర యూనిట్ సన్నిహితుల ద్వారా తెలిసింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ నెవర్ బిఫోర్ అనేలా మంచి ప్లే బాయ్ అవతారంలో కనిపించబోతున్నట్లుగా టాక్ కూడా వస్తోంది. ఇక ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు అని అలాగే ఒక మంచి ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది అని కథనాలు వెలువడుతున్నాయి.

అయితే ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ అంతగా కనెక్ట్ కాలేదు అని ఫ్యాన్స్ నుంచి ఒక నెగిటివ్ కామెంట్ అయితే వినిపిస్తోంది. మరి దర్శకుడు హీరో ఇదే టైటిల్ ఫైనల్ చేస్తారా లేక మరొక టైటిల్ అనుకుంటారా లేదా అనేది తెలియాలి అంటే మరి కొన్నాళ్ళు ఆగాల్సిందే.