Begin typing your search above and press return to search.

విశ్వక్.. ధమ్కీ ఇచ్చేది ఎప్పుడంటే..

By:  Tupaki Desk   |   28 Jan 2023 12:00 PM GMT
విశ్వక్.. ధమ్కీ ఇచ్చేది ఎప్పుడంటే..
X
విశ్వక్ సేన్.. టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరు. ఆయన హీరోగానే కాదు... దర్శకుడిగా కూడా తన సత్తా చాటాడు. వెళ్లిపోమాకే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో... ఈ నగరానికి ఏమైందీ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే ఫలక్ నుమా దాస్ సినిమా విడుదలై పర్వాలేదనిపించింది. తొలి అడుగుల్లోనే మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక మళ్లీ స్వీయ దర్శకత్వంలోనే విశ్వక్ తీస్తున్న సినిమా ధమ్కీ. ఈ సినిమా ఫిబ్రవరి 17న రానుందని తెలుస్తోంది. ఫ‌ల‌క్‌నుమా దాస్ త‌ర్వాత స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో విశ్వ‌క్‌సేన్ రూపొందిస్తోన్న సినిమా ఇది. నివేథా పెతురాజ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. తొలుత ధ‌మ్కీ సినిమాకు పాగ‌ల్ ఫేమ్ న‌రేష్ కొప్పిలి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సెట్స్‌ఫైకి రాక‌ముందే విశ్వ‌క్‌సేన్‌ తో ఏర్ప‌డిన క్రియేటివ్‌ డిఫ‌రెన్సెన్స్ కార‌ణంగా న‌రేష్ కొప్పిలి ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నారు. అత‌డి స్థానంలో విశ్వ‌క్‌సేన్ మెగా ఫోన్ ప‌ట్టి... ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

అయితే విశ్వక్ విభిన్న కథలతో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చేసిన సినిమాల్లో ఏదో ఒకటి మిస్ అవుతూ వస్తోంది. ఈసారైనా మాస్ ఆడియెన్స్ ను మెప్పిస్తాడా అని అనుకుంటున్నారు. ధమ్కీ విశ్వక్ కెరియర్ లో కమర్షియల్ హిట్ గా నిలుస్తుందా లేదని తెలియాలి. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ హిందీ భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ఇప్పటికే ప్రకటించారు. విశ్వక్ సేన్ ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా ఇది. పాగ‌ల్ త‌ర్వాత విశ్వ‌క్‌సేన్‌, నివేథా పేతురాజ్ మ‌రోసారి ధ‌మ్మీలో జంట‌గా క‌నిపించ‌బోతున్నారు.

ధ‌మ్కీ సినిమాను విశ్వ‌క్‌సేన్ ఫాద‌ర్ క‌రాటే రాజు నిర్మిస్తుండగా... లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. కాగా ఇటీవ‌లే సీనియ‌ర్ హీరో అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి విశ్వ‌క్ సేన్ అర్థాంత‌రంగా వైదొల‌గడం వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత విశ్వక్ గామి, అక్టోబర్ 31 లేడిస్ నైట్ సినిమాలు చేయనున్నాడు. విశ్వక్ ధమ్కీ.. పాన్ ఇండియా లెవెల్ లో ఉంటుందో లేదో చూడాలి ఇక.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.