దసరా సమరం ఆ నలుగురి మధ్యేనా?

Sun Jan 29 2023 15:00:01 GMT+0530 (India Standard Time)

dasara festival release movies

సంక్రాంతి సమరం తేలిపోయింది. ఈ సంక్రాంతికి టాలీవుడ్ అగ్ర కథానాయకులు నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ పడ్డారు. నందమూరి బాలకృష్ణ ఫ్యాక్షన్ యాక్షన్ డ్రామా `వీర సింహారెడ్డి`తో ప్రేక్షకుల ముందుకు జనవరి 12న వచ్చారు. ఇక జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య` అంటూ యాక్షన్ డ్రామాతో బరిలోకి దిగారు. అయితే ఈ ఇద్దరిలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి విజేతగా నిలవడం విశేషం.నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` యావరేజ్ టాక్ ని తెచ్చుకోగా మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య` సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ సంక్రాంతి విజేతగా నిలిచింది. సంక్రాంతి సమరం పూర్తయిపోవడంతో అంతా ఫిబ్రవరి నుంచి సమ్మర్ వరకు త సినిమాలని రెడీ చేసుకునే పనిలో పడిపోయారు. దీంతో సమ్మర్ రేస్ కూడా డిక్లేర్ అయిపోయింది.

ఫిబ్రవరి 3 నుంచే ఈ సమరం మొదలు కాబోతోంది. సందీప్ కిషన్ `మైఖేల్ ` నుంచి `పొన్నియిన్ సెల్వన్ 2` వరకు బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాలు సమ్మర్ సమరానికి థియేటర్లలో దండయాత్ర చేయడానికి రెడీ అయిపోతున్నాయి. కల్యాణ్ రామ్ అమిగోస్ ధనుష్ సార్ సమంత శాకుంతలం కార్తికేయ బెదురు లంక వివ్వక్ సేన్ `దాస్ క ధమ్కీ ఉపేంద్ర కబ్జ నాని దసరా రవితేజ `రావణాసుర` అఖిల్ ఏజెంట్ సాయిధరమ్ తేజ్ `విరూపాక్ష` `పొన్నియిన్ సెల్వన్ 2` వరకు బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాలు సమ్మర్ వరకు రిలీజ్ కాబోతున్నాయి.

అయితే దసరా సమరం మాత్రం కేవలం నలుగురి మధ్యే వుండబోతోందని తెలుస్తోంది. అక్టోబర్ లో దసరా సందర్భంగా నాలుగు క్రేజీ పాన్ ఇండియా మూవీస్ పోటీకి సై అంటున్నట్టుగా తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న `హరి హర వీరమల్లు` మూవీని మేకర్స్ దసరా కే విడుదల చేయాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు 60 శాతం చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తోంది.

ఇక మహేష్ త్రివిక్రమ్ ల కలయికలో దాదాపు 12 ఏళ్ల విరామం తరువాత రూపొందుతున్న SSMB28 ని ముందు ఆగస్టలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే ముందు అనుకున్న షెడ్యూల్ మారడంతో ఈ మూవీని దసరాకే థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారట. ఇక `కేజీఎఫ్` డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న `సలార్`ని సెస్టెంబర్ 28న రిలీజ్ చేస్తామంటూ చిత్ర బృందం ప్రకటించింది.

కృష్ణంరాజు అకాలమరణంతో ప్రభాస్ షూటింగ్ షెడ్యూల్ మారింది. దీంతో `సలార్` రిలీజ్ డేట్ కూడా మారే అవకాశం వుందని ఈ మూవీని కూడా దసరాకు రిలీజ్ చేయోచ్చని ఇన్ సైడ్ టాక్. ఇక వీటితో పాటే యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ - శంకర్ ల కలయికలో రూపొందుతున్న `ఇండియన్` సీక్వెల్ ఇండియన్ 2` అక్టోబర్ లో రాబోతోంది. అంటే దసరాని శంకర్ టార్గెట్ చేశాడన్నమాట. ఈ దసరా సమరానికి ఈ నాలుగు క్రేజీ సినిమాలు బరిలో దిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఫైనల్ గా ఈ నాలుగు సినిమాల్లో ఎన్ని దసరా బరిలో దిగుతాయన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.