Begin typing your search above and press return to search.

బండ్ల‌కు చిరు ఏం మెడిసిన్ ఇచ్చారు?

By:  Tupaki Desk   |   8 July 2020 3:45 AM GMT
బండ్ల‌కు చిరు ఏం మెడిసిన్ ఇచ్చారు?
X
పేషెంట్ కి డాక్ట‌ర్ ఇచ్చే ట్రీట్ మెంట్ కంటే.. డాక్ట‌ర్ చెప్పే మంచి మాటలే సాంత్వ‌న క‌లిగిస్తాయి. మాన‌సికంగా ఎంత ధృఢంగా ఉంటే అంతే వేగంగా కోలుకునే వీలుంటుంది. మొన్న‌టికి మొన్న నిర్మాత కం న‌టుడు బండ్ల గ‌ణేష్ కి క‌రోనా మ‌హ‌మ్మారీ పాజిటివ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే అత‌డు కూడా అంద‌రు సామాన్యుల్లానే మాన‌సికంగా ఒత్తిడికి గుర‌య్యాడ‌ట‌.

అయితే అలాంట‌ప్పుడు దేవుడిలా మెగాస్టార్ చిరంజీవి చెప్పిన నాలుగు మంచి మాట‌లు సాంత్వ‌న క‌లిగించాయ‌ని చెప్పాడు బండ్ల‌. కొన్ని రోజుల పాటు వైద్య చికిత్స ఇంటి ద‌గ్గ‌రే చేయించుకున్న బండ్ల‌ ఒంటరిగా స్వీయ నిర్భంధంలోనే ఉండిపోయాడు. అత‌డు ఎంతో నిష్ఠ‌గా ఉండ‌డం వ‌ల్ల‌నే మ‌హ‌మ్మారీ వైదొల‌గింది. వెంటాడి భ‌య‌పెట్టినా స‌త్వ‌రం రోగం త‌గ్గిపోయింది.

తాజా మీడియా ఇంటరాక్షన్ లో బండ్ల చెప్పిన ఓ మాట మాత్రం షాకిచ్చింది. అప్ప‌ట్లో తనకు మెగాస్టార్ చిరంజీవి నుండి ఫోన్ కాల్ వచ్చిందని.. కరోనావైరస్ తో స‌హ‌జీవ‌నం చేసిన త‌న‌లో చిరు కాల్ ఉత్సాహాన్ని నింపిందని చెప్పారు. బాండ్ల గణేష్ చిరును ఎంత‌గా ఆరాధిస్తాడో తెలిసిన‌దే. ప‌వ‌న్ క‌ల్యాణ్ - చిరంజీవి అంటే ప‌డి చ‌స్తాడు. అందుకే అత‌డు మెగా నిర్మాత అయ్యాడు. గ‌బ్బ‌ర్ సింగ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని నిర్మించిన ఘ‌నుడ‌య్యాడు. ఇక మెగా ఫ్యామిలీలో ఏ ఈవెంట్ ఉన్నా బండ్ల త‌ప్ప‌నిస‌రిగా ఎటెండ‌వుతాడు. బండ్ల ఇంట వేడుక‌ల‌కు మెగాస్టార్ చిరంజీవి .. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ అతిథిగా వెళుతుంటారు. అంత గొప్ప కుటుంబ అనుబంధం ఉంది ఆ ఇరువురి న‌డుమ‌.