Begin typing your search above and press return to search.

ఆస్కార్ కి బోస్ గారు స‌రే.. పాట‌గాడు నాటుగాడు?

By:  Tupaki Desk   |   6 Feb 2023 9:45 PM GMT
ఆస్కార్ కి బోస్ గారు స‌రే.. పాట‌గాడు నాటుగాడు?
X
గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కార గ్ర‌హీత‌గా ఎం.ఎం. కీర‌వాణి పేరు ప్ర‌పంచ దేశాల్లో మార్మోగుతోంది. `నాటు నాటు..` పాట‌కు ప్ర‌తిష్ఠాత్మ‌క‌ పుర‌స్కారాన్ని అందుకుని స‌గర్వంగా కీర‌వాణి తెలుగు గ‌డ్డ‌పై అడుగుపెట్టారు. ఆర్.ఆర్.ఆర్ టీమ్ స‌హా కీర‌వాణి ఈ విజ‌యాన్ని ఎంత‌గానో ఆస్వాధించారు. అయితే త‌దుప‌రి ఇంత‌కుమించిన ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన‌ ఆస్కార్ పుర‌స్కారాన్ని గెలుచుకోవాల్సి ఉంది. ఇప్ప‌టికే నాటు నాటు గీతం ఆస్కార్ నామినీల జాబితాలో చేరింది గ‌నుక కచ్ఛితంగా అవార్డ్ ని గెలుచుకుంటుంద‌ని అంతా భావిస్తున్నారు.

అయితే గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారం అందుకునే స‌మ‌యంలో నాటు నాటు లిరిసిస్ట్.. సీనియ‌ర్ ర‌చ‌యిత చంద్ర‌బోస్ కానీ ఆ పాట‌కు కొరియోగ్ర‌ఫీ అందించిన ప్రేమ్ ర‌క్షిత్ కానీ.. గాయ‌కుడు రాహుల్ సిప్లిగంజ్ కానీ కీర‌వాణితో క‌నిపించ‌లేద‌ని కేవ‌లం వేదిక‌పై కీర‌వాణి కుటుంబీకులు మాత్ర‌మే క‌నిపించార‌ని ఒక సెక్ష‌న్ సోష‌ల్ మీడియాల్లో విరుచుకుప‌డింది. ఇంత గొప్ప అవార్డును దేశానికి అందించినందుకు కీర‌వాణి ప్ర‌తిభ‌ను కీర్తిస్తూనే కొంద‌రు ఆ ముగ్గురినీ అవాయిడ్ చేయ‌డం స‌రికాదంటూ విమ‌ర్శించారు.

అంతేకాదు.. చంద్ర‌బోస్- రాహుల్ సిప్లిగంజ్- ప్రేమ్ ర‌క్షిత్ ల‌ను కూడా త‌మ‌తో పాటు ఆస్కార్ పుర‌స్కారాల వేదిక‌కు అయినా ప్రెజెంట్ చేయాల‌ని నెటిజ‌నులు ఆకాంక్షించారు. తాజా స‌మాచారం మేర‌కు.... ఈసారి ఆస్కార్ వేదిక‌కు `నాటు నాటు...` లిరిసిస్ట్ చంద్ర‌బోస్ ని విస్మ‌రించ‌కుండా ఆహ్వానం అందించార‌ని స‌మాచారం. ఎం.ఎం.కీరవాణి ఆస్కార్ వేదికపై ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో చంద్ర‌బోస్ కూడా స‌హ‌క‌రిస్తారు. ఆ ఇరువురు దిగ్గ‌జాలు వేదిక‌పై ఒకే ఫ్రేమ్ లో ఫోజులిస్తారు.

ఆస్కార్ వేడుకకు ఆర్.ఆర్.ఆర్ బృందం ఒక టీమ్ తో వెళుతుంది. ఇందులో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి.. గీత రచయిత చంద్రబోస్ లను ఆహ్వానించ‌డంతో మిగ‌తా ఇద్ద‌రి సంగ‌తేమిటీ? అన్న ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. ఉత్తమ పాటల విభాగంలో నామినీలు వేదికపై ప్రదర్శన ఇవ్వడం సాంప్ర‌దాయం. ఈ వేదికపై కీరవాణి పాట పాడవలసి ఉంటుంది. ఆ స‌మ‌యంలో చంద్ర‌బోస్ కూడా త‌న‌తో ఉంటార‌ని తెలిసింది. అయితే ఈ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ పాట‌ను తెలుగు-హిందీ-త‌మిళం-క‌న్న‌డ‌లో పాడిన రాహుల్ సిప్లిగంజ్ ని ఈ వేదిక‌కు ఆహ్వానించ‌డం లేదా? నాటు నాటుకు అద్భుత‌మైన కొరియోగ్ర‌ఫీ అందించిన ప్రేమ్ ర‌క్షిత్ ని లైట్ తీస్కున్నారా? అంటూ ఇప్పుడు కొన్ని సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే ఎం.ఎం.కీర‌వాణి- చంద్ర‌బోస్ తో పాటు రాహుల్- ప్రేమ్ ర‌క్షిత్ కూడా ఆస్కార్ వేదిక‌కు వెళ్లే టీమ్ లో ఉంటే బావుంటుంద‌నేది కొంద‌రి సూచ‌న‌. కానీ అక్క‌డ ఫీజ‌బులిటీ పాజిబులిటీ ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. ఆస్కార్ వేదిక‌పై మెరిస్తే యువ‌గాయ‌కుడు రాహుల్ కెరీర్ గ్రోత్ కి ఇది మ‌రింత స‌హ‌క‌రిస్తుంద‌ని అత‌డి అభిమానులు సోష‌ల్ మీడియాల్లో సూచిస్తున్నారు. మునుముందు ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.

వారం ముందే వేడుక‌ల‌కు..!

ఆస్కార్ లాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క వేడుక‌ల కోసం ఒక వారం ముందు ఆర్.ఆర్.ఆర్ దిగ్గ‌జాలు లాస్ ఏంజెల్స్ కు వెళ్లనున్నారు. ఎస్.ఎస్.రాజమౌళి- రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డుల్లో త‌మ‌దైన యూనిక్ స్టైల్లో సంద‌డి చేసి హాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ను పాపుల‌ర్ స్టార్ల‌ను త‌మ యాక్ట్ తో మ‌రింత‌గా ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్ త్ర‌యం ప్ర‌ముఖ హాలీవుడ్ సాంకేతిక నిపుణుల‌తో ఇంట‌రాక్ట్ అవ్వ‌డం భార‌తీయ సినిమా ఉన్న‌తికి ముఖ్యంగా తెలుగు సినిమా మ‌హోన్న‌త శిఖ‌రాల‌ను చేర‌డానికి ఉప‌క‌రిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. భ‌విష్య‌త్ లో హాలీవుడ్ ప్ర‌ముఖుల కొలాబ‌రేష‌న్ తో రాజ‌మౌళి స‌హా చ‌ర‌ణ్ - తార‌క్ సినిమాలు చేసేందుకు ఆస్కారం ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.