Begin typing your search above and press return to search.

#ICON పై బ‌న్ని ఆచితూచి.. అస‌లేం జ‌రుగుతోంది?!

By:  Tupaki Desk   |   18 April 2021 1:30 PM GMT
#ICON పై బ‌న్ని ఆచితూచి.. అస‌లేం జ‌రుగుతోంది?!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఐక‌న్ స్టార్ గా మారిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆయ‌న గ‌తంలో ప్రారంభించిన `ఐక‌న్` సినిమా గురించే ఏదీ క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంద‌ని అభిమానుల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఓవైపు మీడియా సమావేశాల్లో దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ఉంటుంద‌ని చెబుతున్నారు. బ‌న్ని న‌టించే ప్ర‌స్తుత సినిమా పుష్ప‌ త‌ర్వాత ఐక‌న్ సెట్స్ కెళుతుంద‌ని ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. వేణు శ్రీ‌రామ్ సైతం బ‌న్నిపై హోప్ తోనే ఉన్నాడు. కానీ బ‌న్ని వైపు నుంచి దానిపై ఎలాంటి ప్ర‌క‌ట‌న లేనే లేదు.

ఇప్ప‌టివ‌ర‌కూ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన వ‌కీల్ సాబ్ పైనా బ‌న్ని రివ్యూ ఇవ్వ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. బ‌న్ని బావున్న ఏ సినిమాని అయినా మెచ్చుకుంటారు. ప్ర‌మోష‌న్ చేస్తారు. మెగా హీరోలు మెగాయేత‌ర‌ సినిమాల‌కు ఎప్పుడూ అత‌డి అండ‌దండ‌లు ఉంటాయి. స్పంద‌న‌లు ఉంటాయి. కానీ ప‌వ‌న్ సినిమాపై స్పందించ‌లేదు ఎందుక‌నో అన్న చ‌ర్చా సాగుతోంది. ``ఆశ్చర్యకరంగా అతను పవన్ కళ్యాణ్ పునఃప్రవేశ చిత్రం వకీల్ సాబ్ పై మౌనంగా ఉన్నారేమిటో!` అన్న ముచ్చ‌ట వినిపిస్తోంది.

అయితే ఐక‌న్ ద‌ర్శ‌కుడే వ‌కీల్ సాబ్ తీసి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాక‌.. ఇంకా ఆల‌స్యం దేనికి? అన్న ప్ర‌శ్న కొంద‌రిలో బ‌లంగా ఉంది. గత కొన్ని వారాలుగా శ్రీరామ్ వేణు ..నిర్మాత దిల్ రాజు ఇద్దరూ భవిష్యత్తులో ఐకన్ ఉంటుంద‌ని ప్ర‌క‌టిస్తున్నారు. దీనికి బ‌న్ని వైపు నుంచి రెస్పాన్స్ అయితే క‌నిపించ‌డం లేదు. ఇంత‌కీ బ‌న్ని వెర్ష‌న్ ఏమిటి? అన్న‌ది తేల‌డం లేదు. పుష్ప పూర్త‌య్యేవ‌ర‌కూ దేని గురించీ మాట్లాడే ఆలోచ‌న బ‌న్నీ కి లేదా? అని ప్ర‌శ్నిస్తున్నారు.