Begin typing your search above and press return to search.
బుల్లి బిపాసా ముఖాన్ని ఇంకా దాచేస్తే ఎలా?
By: Tupaki Desk | 6 Feb 2023 7:00 AMమహేష్ `టక్కరి దొంగ` సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బిపాసా బసు తెలుగు యువత మనసులను దోచింది. పెద్ద తెరపై బిప్స్ అందానికి దాసోహం కాని యువకుడు లేడు. కానీ ఆ తర్వాత ఎందుకనో బిపాసా తెలుగు పరిశ్రమలో నటించలేదు. బాలీవుడ్ లో రేస్- ధూమ్ సహా పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటించి భారీ ఫాలోయింగ్ సంపాదించిన బిపాసా చాలా కాలం పాటు `పఠాన్` విలన్ జాన్ అబ్రహాంతో సహజీవనం సాగించింది. కానీ కాలక్రమంలో ఈ జంట బ్రేకప్.. అటుపై టీవీ నటుడు కరణ్ సింగ్ తో ప్రేమాయణం అనంతరం పెళ్లి .. ఇటీవల వారసుడి జననం వగైరా తెలిసిన వ్యవహారాలే.
నవంబర్ 2022లో కరణ్ సింగ్ గ్రోవర్ తో తన మొదటి బిడ్డకు తల్లి అయిన బిపాసా తన పసికందు దేవి ఫోటోల(ముఖం పాక్షికంగా కప్పేస్తూ)ను ఇప్పటికే పలుమార్లు షేర్ చేసారు. ఇప్పుడు మరో కొత్త ఫోటోని బిపాసా బసు పోస్ట్ చేసింది. ఈ అందమైన స్నాప్ కి కారకుడైన వివాన్ భతేనాకు బసు కృతజ్ఞతలు తెలియజేసింది.
2022 నవంబర్ 12న తమ మొదటి ఆడ బిడ్డకు జన్మనిచ్చినట్లు కరణ్-బిపాసా జంట ప్రకటించారు. ఇన్ స్టా ప్రకటన లో బేబి దేవి బసు సింగ్ గ్రోవర్ అని పేరును వెల్లడించారు. నవజాత శిశువు చిరు పాదాల ఫోటోను ఆవిష్కరిస్తూ కరణ్ సింగ్ గ్రోవర్- బిపాసా బసు జంట తమ కుమార్తె పుట్టినట్లు ప్రకటించారు.12.11.2022న దివ్యమైన ఇందిరా బసు సింగ్ గ్రోవర్ కి మీ ప్రేమ ఆశీర్వాదాలు కావాలి అని కోరారు. అప్పటి నుండి తమ కుమార్తెను వదిలి క్షణం కూడా ఉండటం లేదు ఈ జంట. ప్రతిసారీ సామాజిక మాధ్యమాల్లో ఫోటోని షేర్ చేసినా ముఖం కనబడకుండా జాగ్రత్త పడ్డారు. పాప దేవి ముఖాన్ని ఎమోజీలతో కప్పి ఉంచుతూ తమ బుల్లి యువరాణిని ఇన్నాళ్లు దాచేశారు. బిపాసా ఇప్పుడు తన కుమార్తె దేవితో సమయం గడిపిన మరొక అందమైన ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటో ఎంతో స్వీట్ గా ఉందంటూ అభిమానుల కితాబు అందుకుంది.
బిపాసా బసు తన రెండు నెలల కుమార్తె దేవి పాదాలను తన చేతులతో పట్టుకుని ఈ ఫోటోలో కనిపించింది. చిన్నారి పాపాయి పాదాలను తన చెంపలను తాకే వేళ ఆ అమూల్యమైన క్షణాన్ని ఆస్వాధిస్తూ కనిపించింది. ఆమె ఆనందాన్ని ఈ క్షణం అస్సలు దాచుకోలేదు. ఇది అనితర సాధ్యమైన ఆనందం. ఈ ఫోటోలో బిపాసా తెల్లటి కోల్డ్-షోల్డర్ డ్రెస్ లో కనిపించగా.. నీలిరంగు దుస్తులతో పాపాయి దేవి చక్కందం ఆకట్టుకుంది. నటుడు వివాన్ భతేనా ఈ ఫోటోను తీశాడు. బిపాసా అటువంటి అరుదైన మూవ్ మెంట్ ని కెమెరాలో ఫ్లాష్ మెరిపించినందున అతనిని అభినందించింది. ఈ ఫోటోకి క్యాప్షన్ లో తల్లిదండ్రులుగా అత్యంత అందమైన పాత్ర పోషిస్తున్నామని పేర్కొంది. నా జీవితంలో అత్యంత అందమైన పాత్ర `దేవి`. మా దుర్గా తో ఈ సమయాన నేను అనందకర క్షణాలను ఆస్వాధిస్తున్నాను. మంకీ లవ్.. మెమరీస్ ఆఫ్ దేవి అంటూ హ్యాష్ ట్యాగులతో ఈ ఫోటోలను వైరల్ చేసింది బిప్స్.
గత నెలలో ఆమె పోస్ట్ చేసిన ఒక వీడియోలో బిపాసా బసు తన కుమార్తె దేవి పాదాలను తాకుతూ లాలించడం ఆకర్షించింది. దేవుడు నాకు ఉత్తమ బహుమతిని ఇచ్చాడు అంటూ కృతజ్ఞతా భావాన్ని ఆ లేఖలో రాసింది. నా కుమార్తె దేవి నా మొదటి ఉత్తమ బహుమతి.. నా జీవితంలోని ప్రేమ... నా భర్త...అంటూ ఆనందం వ్యక్తం చేసింది. అయితే ప్రతిసారీ పాపాయి ముఖాన్ని మాత్రం దాచేస్తోంది. దీంతో అభిమానులు పాప ముఖాన్ని ఇంకా ఎన్నాళ్లు దాచేస్తావ్ బిప్స్ ? అని ప్రశ్నిస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... బిపాసా ప్రస్తుతం తన భర్తతో కలిసి టీవీ షోలు సినిమాలు నిర్మిస్తున్నారు. బిజీ ఎంటర్ ప్రెన్యూర్ గా కొనసాగుతూనే వారసురాలి భవిష్యత్ గురించి కలలు కంటోంది. ఈ మధుర క్షణాలను బిపాసా ఎంతో ఆస్వాధిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.